Project K : ‘ప్రాజెక్ట్ కె’ యాక్షన్ సీన్స్ నభూతో న భవిష్యతి.! స్కెచ్ మావులుగా లేదుగా.!
NQ Staff - September 15, 2022 / 08:17 PM IST

Project K : ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాకి అంతకంతకూ భారీ తనం యాడ్ అయిపోతూ వస్తోంది. ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Project K action scenes are amazing
అశ్వనీదత్ ముందే చెప్పారు, ఈ సినిమాతో ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ అంటే చైనా, అమెరికా తదితర దేశాలను టార్గెట్ చేయబోతున్నామని. అందుకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలోని ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ చిత్రీకరణ జరుగుతోందట.
ప్రబాస్‌తో పెద్ద స్కెచ్చే వేశారుగా.!
సుదీర్ఘమైన యాక్షన్ ఎపిసోడ్స్ కావడంతో పలువురు హలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారట. ఒక్కో యాక్షన్ సీన్ కోసం దాదాపు నలుగురు నుంచి ఐదుగురు యాక్షన్ కొరియోగ్రఫర్లు వర్క్ చేస్తున్నారనీ తెలుస్తోంది. ఒక్క యాక్షన్ దర్శకుడితో కానిచ్చేస్తే విజువల్‌గా సరైన న్యాయం జరగదన్న వుద్దేశ్యంతోనే నలుగురైదుగురు వేర్వేరు యాక్షన్ యూనిట్లు ‘ప్రాజెక్ట్ కె’ కోసం పని చేస్తున్నాయట.
మూడో ప్రపంచ యుద్ధం యొక్క కాలక్రమం చుట్టూ ఈ యాక్షన్ బ్లాక్స్ కాన్సెప్ట్ వుండబోతోందట. మొత్తం ఐదు సుదీర్ఘమైన యాక్షన్ బ్లాక్స్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఐదింటికి ఐదూ వేటికవే ప్రత్యేకంగా వుండబోతున్నాయట. ఒక్కో యాక్షన్ బ్లాక్ ఒక మామూలు సినిమాలోని నాలుగైదు యాక్షన్ బ్లాక్స్‌కి సమానమైనదంటూ యూనిట్ అభివర్ణిస్తోందంటేనే అర్ధం చేసుకోవచ్చు ‘ప్రాజెక్ట్ కె’ భారీతనం ఏ స్థాయిలో వుండబోతోందో.!