Sonusood: పేదలకు దేవుడు, నిర్మాతలకు మాత్రం యముడిగా మారిన సోనూసూద్
Samsthi 2210 - June 3, 2021 / 10:22 AM IST

SonuSood: సోను సూద్.. ఇప్పుడు మన సూపర్ స్టార్ ల కంటే ఈయనకు క్రేజ్ ఎక్కువగా ఉంది. దానికి కారణం ఆయన రియల్ ఇమేజ్. గత ఏడాదిన్నర కాలంగా సోనూ సూద్ చేస్తున్న సేవలు ఆయన ఇమేజ్ ను ఆకాశమంత పెంచేశాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈయనను విలన్ గా తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఎందుకంటే ఈయన రియల్ ఇమేజ్ దానికి అడ్డు వస్తుంది. హీరోలు కూడా తెరపై ఈయనను కొట్టాలి అంటే ఆలోచిస్తున్నారు.. సందిగ్ధంలో పడిపోతున్నారు. అలాంటి సూపర్ ఇమేజ్ సొంతం చేసుకున్న సోను సూద్.

Producers Shock with Sonusood Hike Remuneration
ఇప్పుడు నిర్మాతలకు తన రెమ్యూనరేషన్ తో చుక్కలు చూపిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీలలో సోను వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇంతకు ముందు సినిమాకు కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్యలో తీసుకునేవాడు. తెలుగు సినిమాలకు అయితే కాల్ షీట్ ప్రకారం కూడా డబ్బులు తీసుకున్నాడు. అలా ఒక్క సినిమాకు కోటి రూపాయల పారితోషికం అందుకున్నాడు సోను సూద్.
మొన్న సంక్రాంతికి విడుదలైన బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాకు రెండున్నర కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈయన రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు కోట్లకు పైగా ఈయన పారితోషికం కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క సినిమాకు అంత ఇస్తే తాము తట్టుకోలేము అంటున్నారు నిర్మాతలు.. కానీ సోనూసూద్ సినిమాలో ఉంటే ఖచ్చితంగా దాని పై అంచనాలు పెరగడం కాదు క్రేజ్ కూడా డబుల్ అవుతుంది.
ప్రస్తుతం తనకు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈయన తన రెమ్యూనరేషన్ డబుల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత మొత్తంలో డిమాండ్ చేసినా కూడా కొందరు నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య బాలకృష్ణ సినిమాలో సోనూసూద్ ను ఒక కీలక పాత్ర కోసం తీసుకోవాలని ఆలోచించినా.. రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఆచార్య సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు సోను. ఈ సినిమా కోసం రెండు కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బాలీవుడ్ లో ఏం హీరోగా మారడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని కథలు కూడా విన్నాడు. తనకు వచ్చిన రియల్ ఇమేజ్ ను హీరోగా మారి నిలబెట్టుకోవాలని చూస్తున్నారు ఈయన.