Sharwanand : ఆరు సంవత్సరాలు షర్ట్‌ కూడా కొనుక్కోకుండా ఆ సినిమా అప్పులు తీర్చాను

NQ Staff - September 8, 2022 / 11:59 AM IST

Sharwanand  : ఆరు సంవత్సరాలు షర్ట్‌ కూడా కొనుక్కోకుండా ఆ సినిమా అప్పులు తీర్చాను

Sharwanand  : ఒక్క సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అది శర్వానంద్ విషయంలో రుజువు అయింది. కో అంటే కోటి సినిమాతో శర్వానంద్ నిర్మాతగా పరిచయమయ్యాడు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో నిర్మాత గా శర్వానంద్ కి భారీ నష్టాలు వచ్చాయి.

ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చేందుకు

శర్వానంద్ ఎన్నో సినిమాలకు కమిట్ అవ్వాల్సి వచ్చింది. ఏకంగా ఆరు సంవత్సరాల పాటు కష్టపడి ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చినట్లుగా శర్వానంద్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Producer Sharwanand Suffered Huge Losses

Producer Sharwanand Suffered Huge Losses

ఈ ఆరు సంవత్సరాల పాటు తాను కనీసం ఒక షర్ట్ కూడా కొనుక్కోకుండా చేసిన అప్పులను తీర్చాను అంటూ శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతగా అప్పులు ఉంటే శర్వానంద్ ఎందుకు వరుస సినిమాలు చేయడం లేదని కొందరు ప్రశ్నిస్తూ ఉంటే.. మరీ షర్టు కొనుక్కోలేనంత అప్పులు ఏంటి బాసు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి శర్వానంద్ అప్పులు ఇప్పటికి తీరాయి. దాంతో ఇకపై అయినా షర్టులు కొనుక్కుంటాడేమో చూడాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

ఒకే ఒక్క జీవితం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో శర్వానంద్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించాడు. కో అంటే కోటి సినిమా తాను జీవితంలో మర్చిపోలేని అనుభవాలను ఇచ్చిందని.. ఎప్పటికీ ఆ సినిమా మిగిల్చిన నష్టాలను మర్చిపోలేను అంటూ శర్వానంద్ అప్పటి జ్ఞాపకాలను నెమర వేసుకున్నాడు. మళ్లీ నిర్మాతగా చేసే ఉద్దేశం లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us