Naga Vamsi And Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాకి నిర్మాత అయితే.. ఆ ఇబ్బందులు తప్పవ్: నిర్మాత నాగవంశీ.!
NQ Staff - October 4, 2022 / 12:53 PM IST

Naga Vamsi And Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తే ఆ కిక్కే వేరప్పా.. అంటున్నారు యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ. ‘భీమ్లానాయక్’ సినిమాకి పవన్ కళ్యాణ్ 100 పర్సంట్ ఎఫర్ట్స్ పెట్టారంటున్న నిర్మాత నాగవంశీ, సినిమాకి సంబంధించి ప్రతి విషయమ్మీదా ఆయనకు అవగాహన వుందని చెప్పారు.
‘అన్నీ తెలుసుకుని, సెట్స్‌లోకి వస్తారు.
అందుకే, సినిమా షూటింగ్ సరదాగా, వేగంగా పూర్తవుతుంది. స్టార్ హీరోనన్న బేషజం ఏనాడూ పవన్ కళ్యాణ్‌లో కనిపించదు..’ అని చెప్పారు నాగవంశీ. పవన్ కళ్యాన్ సినిమాకి నిర్మాత అయితే.. ఇబ్బందులుంటాయ్..
‘డీజే టిల్లు’ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఏదో చిన్న మాట అంటే, దాన్ని రాజకీయాలకు ఆపాదించారనీ, పవన్ కళ్యాణ్ సినిమాకి నిర్మాతనవడం వల్లే ఆ ఇబ్బందులు వచ్చాయని నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
‘చాలా ఇబ్బందులుంటాయ్, చాలా ఒత్తిళ్ళు వస్తాయ్.. వాటి గురించి మళ్ళీ మాట్లాడదలచుకోలేదు.. ఆయన చాలా మంచి మనిషి, నిర్మాతల్ని సపోర్ట్ చేస్తారు.. ఆయనతో వర్క్ చేయడం ఎవరికైనా చాలా తేలిక..’ అంటూ నాగవంశీ, పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొచ్చారు.
చిన్న వయసులోనే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా నాగవంశీ రాణిస్తున్న సంగతి తెలిసిందే.