Priyanka Singh: నాతో పాటు నా ఫ్రెండ్ కూడా లింగ మార్పిడి చేయించుకుంది

Priyanka Singh: ‘జబర్దస్త్’ షో లో లేడీ గెటప్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి తేజ ఇప్పుడు ప్రియాంక సింగ్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ‘బిగ్ బాస్ 5’ లో పార్టిసిపెట్ చేస్తుంది. చిన్నతనం నుంచి తండ్రి వ్యతిరేకించడం.. కష్టపడి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి ఎంటర్ అవడం, లింగ మార్పిడి సర్జరీ, అనారోగ్య సమస్యలు, మెగా బ్రదర్ నాగబాబు సాయం చెయ్యడం.. ఇప్పుడు ‘బిగ్ బాస్’ హౌస్‌‌లోకి వెళ్లడం.. ఇలా సాయి తేజ అలియాస్ ప్రియాంక సింగ్ అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది.

Priyanka Singh About His Friend Change Gender
Priyanka Singh About His Friend Change Gender

ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈసారి 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. వెండితెర, బుల్లితెర నటులు, సోషల్ మీడియా సెలబ్రెటీలు, యాంకర్లు పాల్గొనగా ట్రాన్స్ జెండర్ గా ప్రియాంక సింగ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్టు బిగ్ బాస్ షోలో కూడా చెప్పుకొచ్చింది. తనకు ఈ రియాలిటీ షో మంచి వేదిక అని ముసుగు కప్పుకొని మనిషిలా ఉన్నానని తెలిపింది. కానీ ఇప్పుడు అలా లేనంటూ కుటుంబం కోసం సర్దుకున్నానని తెలిపింది.

ఇక తన ఫ్రెండ్ నిషా కూడా తాను చెబితే విని ఆమె కూడా లింగ మార్పిడి చేయించుకుందని.. అదికూడా ఇద్దరం ఒకేసారి చేయించుకున్నామని తెలిపింది. సాయితేజగా అందరికీ తెలిసినా ప్రియాంక చిన్న‌ప్పటి నుంచి అమ్మాయిగా ఉండటానికే ఇష్టపడ్డానని చెప్పింది ప్రియాంక. స్క్రీన్‌పై కామెడీ చేసే తన జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయని ఆమె గతంలో తెలిపింది.

తనకు ఐదేళ్లు ఉన్నప్పటి నుంచే అక్క బట్టలు వేసుకోవడం.. ఆ తర్వాత చీరలు కట్టుకోవడం లాంటివి ఎవరికీ తెలియకుండా చేసానని చెబుతుంది ఈమె. ఇక అమ్మానాన్నలకు చెప్పకుండానే.. ఫ్రెండ్స్ సాయంతో తాను ఆపరేషన్ చేయించుకున్నట్లు వెల్లడించింది.

ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకా సింగ్. అక్కడ ఆమె సత్తా చాటి.. తనని తాను ఫ్రూవ్ చేసుకోగలిగితే.. భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయి. కెరీర్ పరంగా నిలదొక్కుకునే అవకాశం కూడా ఉంటుంది.