Priyanka Jawalkar: తిమ్మ‌ర‌సు బ్యూటీ ఇంత‌లా రెచ్చిపోయిందేంటి?

Priyanka Jawalkar:హీరోయిన్,యాంక‌ర్స్ పోటీ ప‌డీ గ్లామ‌ర్ షో చేస్తున్నారు. వీరి అందాల ఆర‌బోత‌తో నెటిజ‌న్స్ నిద్ర‌లేని రాత్ర‌లు గడుపుతున్నారు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఫొటోషూట్స్‌తో ర‌చ్చ చేస్తూనే ఉన్నారు. తాజాగా తిమ్మ‌ర‌సు బ్యూటీ ప్రియాంక జ‌వాల్క‌ర్ ఎద అందాల‌తో పాటు న‌డుము అందాల‌ను చూపిస్తూ యువ‌త‌ని తెగ అట్రాక్ట్ చేస్తుంది. తెలుగు అందం ఇంత హాట్‌గా ఉంటుందా అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

TheNewsQube-
Priyanka Jawalkar Stylish Photoshoot
Priyanka Jawalkar Stylish Photoshoot

విజయ్ దేవరకొండ నటించిన ట్యాక్సీవాలా సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాతో పరిచయం అయినా బ్యూటీ ప్రియాంక జ‌వాల్క‌ర్ ఈ మ‌ధ్య తిమ్మ‌ర‌సు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆమె న‌టించిన సినిమాలు ఈ మ‌ధ్య కాలంలో చాలా త‌క్కువ‌గా విడుద‌ల‌య్యాయి. దానిపై రీసెంట్‌గా స్పందించింది ప్రియాంక‌.

”మూడేళ్లుగా తెరపై కనిపించకపోయినప్పటికి .. నేను ఏ ఒక్క రోజు ఖాళీగా లేను. ఏదోక సినిమాతో సెట్స్‌పై ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటున్నా. టాక్సీవాలా విడుదలకు ముందు నుంచే ఎన్నో ఆఫర్లు వచ్చాయి. పదుల సంఖ్యలో స్క్రిప్ట్‌లు విన్నా ఆలా విన్న వాటిలో గమనం కథ నచ్చింది అందుకు ఓకే చెప్పను. ఆ సినిమా 2019లోనే సెట్స్‌పైకి వెళ్లింది. ఆతర్వాత ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం చేశా. ఈ రెండు సినిమాలు గతే సంవత్సరమే విడుదల అవ్వాల్సినప్పటికీ.. కరోనా కారణంగా ఆలస్యమయ్యాను అంటూ చెప్పుకొచ్చారు.

టాక్సీవాలా సినిమా తర్వాత చాలా లావుగా మారిన ప్రియాంక.. దీనికి కారణం థైరాయిడ్‌ సమస్యతో పాటు హార్మోన్ల అసమతౌల్యం అని చెప్పుకొచ్చింది. అయితే దానిని గుర్తించలేకపోవ‌డం వ‌ల‌న‌ ఒకనొక సమయంలో ముఖమంతా మొటిమలు విపరీతంగా వచ్చాయన్న ప్రియాంక.. తీరా ఆస్పత్రికి చెక్‌ చేయించుకుంటే తనకున్న సమస్యలన్నీ బయటపడ్డాయని తెలిపారు. ఆ క్షణంలో చాలా భయటపడ్డానన్న ఈ అమ్మడు.. తర్వాత జీవన శైలిని పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారంట. వ్యాయామాలు, యోగా చేయడంతోపాటు ప్రత్యేక డైట్ తీసుకొని మాములు స్థితికి వ‌చ్చాన‌ని పేర్కొంది.