Priyanka Jawalkar: చ‌క్కని రూపంతో కుర్రాళ్ల మ‌న‌సుల‌ని దోచేస్తున్న ప్రియాంక‌

Priyanka Jawalkar విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది ఈ బ్యూటీ. ఇందులో ప్రియాంక న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. టాక్సీవాలా సినిమాతర్వాత ఈ అమ్మడు ఇటీవల ఎస్ ఆర్ నగర్ కల్యాణమండపం అనే సినిమాలో నటించింది.

రీసెంట్ గా సత్య దేవ్ నటించిన తిమ్మరుసు సినిమాలో మెరిసింది ప్రియాంక. ఇందులోను ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి .ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ తెలుగందం.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రియాంక‌.. కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వడంలేదు. ప్రియాంక అందాలను పొగుడుతూ ఈ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు .

తాజాగా బ్లాక్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తుంది. ప్రియాంక క్యూట్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు. గ్లామర్ పరంగా,నటనా పరంగా ఈ తెలుగుమ్మాయికి మంచి మార్కులే పడ్డాయి. అయితే సినిమా అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. సినీ ఇండస్ట్రీలోకి ప్రియాంక ఎంట్రీ ఇవ్వకముందు దారుణంగా ఉండేది.

ఆ మ‌ధ్య ప్రియాంక‌ పాత్ ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు రాగా, దానిపై నెటిజ‌న్స్ తెగ ట్రోల్ చేశారు. చబ్బీగా, పింపుల్స్‌తో ఉన్న ఆ ఫోటోపై వచ్చిన కామెంట్లను సున్నితంగా తిప్పి కొట్టారు ప్రియాంక.