Priyanka Jawalkar: హాస్పిట‌ల్‌కి వెళ్లిన‌ప్పుడు నాలో ఉన్న స‌మ‌స్య‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి: టాక్సీవాలా బ్యూటీ

Priyanka Jawalkar: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన టాక్సీవాలా చిత్రంతో మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న భామ ప్రియాంక జ‌వాల్క‌ర్. ఈ సినిమాలో ప్రియాంక న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. అందంతో పాటు మంచి అభిన‌యంతో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ యూత్‌ని బాగా ఆక‌ట్టుకుంది. అయితే టాక్సీవాలా చిత్రం విడుద‌లై మూడేళ్లు కావొస్తున్నా ఒక్క‌టంటే ఒక్క సినిమాని కూడా విడుద‌ల చేయ‌లేక‌పోయింది.

Priyanka Jawalkar

టాక్సీవాలా చిత్రం త‌ర్వాత ప్రియాంక పెద్ద‌గా సినిమాల‌పై ఆస‌క్తి చూప‌లేదు. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో ఆడియెన్స్‌ను కట్టిపడేసేందుకు రెడీ అయ్యారు. ఈ మూడేళ్లలో తాను ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా లేనని, సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆమె నటించిన తిమ్మరుసు సినిమా విశేషాలను చెబుతూ తన పర్సనల్ సంగతులను కూడా వివరించారు.

టాక్సీవాలా త‌ర్వాత త‌న జీవితంలో అనేక సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయ‌ని పేర్కొంది ప్రియాంక‌.ధైరాయిడ్ స‌మ‌స్య‌తో విప‌రీతంగా బ‌రువు పెర‌గ‌డం, దానికి తోడు హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వ‌ల‌న నా ముఖం మొత్తం మొటిమ‌లు వ‌చ్చాయి. అవి చూసి నేనే భ‌య‌ప‌డ్డాను. అయితే వాటి కోసం అని హాస్పిట‌ల్‌కి వెళ్లి చెక్ చేయించుకోగా నాకున్న స‌మ‌స్య‌లు అన్ని బ‌య‌ట‌ప‌డ్డాయి. కానీ డాక్టర్‌ సలహాతో లైఫ్‌ స్టైల్‌ని మొత్తం మార్చుకున్నాను.

Priyanka Jawalkar

యోగా, వ్యాయామాలతో పాటు ప్రత్యేక డైట్‌ తీసుకునేదాన్ని. ఇంట్లోనే రకరకాల కసరత్తులు చేసిన మళ్లీ ఫిట్‌గా మారిపోయాను అని చెప్పుకొచ్చింది ప్రియాంక‌. కాలేజీ రోజుల్లో నేను చ‌బ్బీగా ఉన్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. ఇందులో ముఖానికి మొటిమ‌లు కాస్త అంద విహీనంగా ఉండ‌డంతో ట్రోల్ చేశారు. నా ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల‌నే అంత బ‌రువు పెరిగాను అని చెప్పుకొచ్చింది ప్రియాంక‌.

ప్రియాంక న‌టించిన తిమ్మరుసు, గమనం, ఎస్‌.ఆర్‌. కల్యాణమండపం చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. దీనితో పాటు ఓ తమిళ సినిమాకు కూడా సైన్‌ చేసినట్లు ప్రియాంక వెల్లడించింది. అయితే తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు రావని, వచ్చినా కూడా అవి కోల్పోవాల్సి వస్తుందనే టాక్ ఉంది. దానిపై ప్రియాంక స్పందిస్తూ.. ఈమధ్య ఇండస్ట్రీలో తెలుగు కథానాయికల సందడి బాగానే కనిపిస్తోంది. మంచి అవకాశాలే దక్కుతున్నాయి అని పేర్కొంది.