Priyanka Chopra : భ‌ర్త పేరు తొల‌గించిన ప్రియాంక చోప్రా…ఈ అమ్మ‌డు కూడా విడాకులు తీసుకోనుందా..!

Priyanka Chopra : సెల‌బ్రిటీల రిలేష‌న్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు క‌లుస్తారో, ఎప్పుడు విడ‌కాలు తీసుకుంటారో ఎవ‌రికి అర్ధం కాదు. త‌న భ‌ర్త నిక్ జోన‌స్ నుంచి ప్రియాంక చోప్రా విడిపోనుందా! అంటే అవున‌నే గుస‌గుస‌లాడుతున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు. నాగ‌చైత‌న్య‌తో విడిపోయే ముందు స‌మంత ఎలా బిహేవ్ చేసిందో అలాగే ఇప్పుడు ప్రియాకం చోప్రా ప్ర‌వ‌ర్తిస్తుంది.

TheNewsQube-
priyanka chopra removes husband surname on instagram
priyanka chopra removes husband surname on instagram

చైతుతో స‌మంత కొత్త ఇంట్లోకి వెళ్లాల‌నుకున్నారు. త‌ర్వాత వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌చ్చాయి. ఇద్ద‌రూ విడిపోవాల‌నుకున్న త‌ర్వాత ముందు స‌మంత సోష‌ల్ మీడియాలో త‌న పేరులో ఉండే అక్కినేని అనే పేరుని తొల‌గించి పాత పేరు స‌మంత రూత్ ప్ర‌భు అని పెట్టుకుంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా సేమ్ టు సేమ్ అలాగే చేస్తుంది.

ఇప్పుడు ప్రియాంక చోప్రా త‌న భ‌ర్త పేరును త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తొల‌గించింది. రీసెంట్‌గా ఆమె త‌న భ‌ర్త నిక్ జోన‌స్‌తో క‌లిసి లాస్ ఏంజిల్స్‌లోని కొత్త ఇంటికి మకాం మార్చింది. అలా మార్చిందో లేదో ఇన్‌స్టాలో త‌న భ‌ర్త పేరుని లేపేసింది. ఈ చ‌ర్య‌లు బాలీవుడ్ వ‌ర్గాల‌కు అనుమానాల‌ను రేకెత్తిస్తున్నాయి. నిక్ నుంచి ప్రియాంక విడిపోనుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

2018లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ లవ్‌బర్డ్స్‌ ఎపుడూ తమ ప్రేమకు సంబంధించిన విషయాలను ముచ్చటిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ జంటకు సంబంధించిన ఓ సంచలన విషయం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రోఫైల్‌ పేరు నుంచి భర్త నిక్‌ జోనస్‌ పేరును తొలిగించింది. దీంతో అది చూసి ఆమె ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ అంతా షాక్‌కు గురవుతున్నారు.

రెండేళ్ల పాటు ఇద్ద‌రూ క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. ఇద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త‌ను చూసి కుళ్లుకున్న‌వాళ్లున్నారు. సంతోషించిన‌వారున్నారు. అయితే ఏమైందో ఏమో.. ఇద్ద‌రు మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చాయేమో తెలియ‌దు కానీ. ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి జోన‌స్ అనే పేరుని తొల‌గించేసింది.