Priyanka Chopra : ప్రియాంక త‌న భ‌ర్త పేరు తొల‌గించ‌డానికి అస‌లు కార‌ణం ఇది…!

Priyanka Chopra : ప్రియాంక చోప్రా తనకన్నా దాదాపు 10 ఏళ్ళు చిన్నవాడైన అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రియాంక పెళ్లి కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ఇక వారిద్దరు విడిపోతున్నారంటూ వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. దీనికి కారణం ప్రియాంక తన సోషల్ మీడియా ఖాతాలైన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ప్రొఫైల్లో‌ తన పేరు మార్చింది.

Priyanka Chopra remove her husband name in social media
Priyanka Chopra remove her husband name in social media

పెళ్లితర్వాత తన భర్త పేరు నిక్ పేరును తన పేరుతో జత చేసుకున్న పీసీ.. ఇప్పుడు ఈ పేరును తొలగించింది. దాంతో ప్రియాంక – నిక్ విడిపోతున్నారన్న ప్రచారం మరింత జోరందుకుంది. ఈ వార్తలపై ప్రియాంక తల్లి స్పందించింది. ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా మాట్లాడుతూ.. ప్రియాంక – నిక్ విడాకులు అంటూ వస్తున్న వార్తలను ఖండించారు.

Priyanka Chopra remove her husband name in social media
Priyanka Chopra remove her husband name in social media

ప్రియాంక- నిక్ విడిపోవడంలేదు అని అవన్నీ పుకార్లు మాత్రమేనని ఆమె అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను అభిమానులు నమ్మ వద్దు అని ఆమె కోరారు. 2018లో పెద్దలను ఒప్పించి ఒక్కటైన ప్రియాంక- నిక్ తమ దాంపత్య జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లో ఈ జంట కలిసి చేసిన సందడి జరుపుకున్నారు.

ప్రియాంక త‌న భ‌ర్త పేరుని ఎందుకు తొలగించింద‌నే దానిపై ఆరాలు తీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రియాంక కూడా త‌న పేరు చివ‌ర ఉన్న చోప్రా, జోనాస్ అనే ప‌దాల‌ను తొల‌గిస్తే న్యూమ‌రాల‌జీ, ఆస్ట్రాల‌జీ ప్ర‌కారం లైఫ్ బాగుంటుంద‌ని రెండు ప‌దాల‌ను తొల‌గించి కేవ‌లం ప్రియాంక‌గా కొన‌సాగ‌నున్న‌ట్లు చెప్పింది.

ప్ర‌స్తుతం నటిగా ప్రియాంక దూసుకుపోతుంది. పాప్‌ సింగర్‌గా నిక్‌ జోరుమీదున్నాడు. అయితే అమెరికాలో ప్రియాంక ఆ మధ్య ఓ రెస్టారెంట్‌ని కూడా ప్రారంభించింది. అక్కడ ఇండియన్‌ వంటకాలను అమెరికన్లకి అందిస్తుంది. అంతేకాదు ఇటీవల దీపావళి సందర్భంగా లాస్‌ ఏంజెల్స్ లో కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఆ సందర్భంగా పిక్‌ని కూడా పంచుకుని మహాలక్ష్మీ దేవత ఆశీస్సులతో తాను కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నట్టు తెలిపింది ప్రియాంక.