Priyanka Chopra: 39 ఏళ్ల వ‌య‌స్సులోను ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న ప్రియాంక చోప్రా

Priyanka Chopra: బాలీవుడ్‌లో స‌త్తా చాటిన ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లోను అల‌రిస్తుంది. అంత‌ర్జాతీయంగా పేరు ప్ర‌ఖ్యాత‌లు గావించిన ప్రియాంక ‘క్వాంటికో’ అనే వెబ్‌సిరీస్‌తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సిరీస్‌లో అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ర‌చ్చ చేసింది.ఈ వెబ్ సిరీస్‌తో హాలీవుడ్‌లోను ప్రియాంక క్రేజ్ ద‌క్కించుకుంది. ఇక ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌,సినిమాలు, సీరియల్స్ అంటూ హాలీవుడ్‌లో ర‌చ్చ చేస్తుంది.

priyanka chopra

నిక్ త‌న‌క‌న్నా ప‌ది సంవ‌త్సరాల చిన్న‌వాడైన నిక్ జోనాస్‌ని వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయింది. 2018లో నిక్- ప్రియాంక వివాహం జ‌ర‌గ‌గా, విదేశీ సాంప్రదాయంతో పాటు.. భారతీయ సాంప్రదాయ పద్దతిలో జ‌రిపించారు. ఈ జూలై 20కి ప్రియాంక‌-నిక్‌ల వైవాహిక జీవితానికి మూడు సంవ‌త్స‌రాలు పూర్తి కాగా, ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. ఈ కాలం మొత్తం ఓ రెప్పపాటులా ఉందంటూ ఆమె పేర్కొంది. ‘ఐ లవ్‌ యూ’ అంటూ ఆమె స్పష్టం చేసింది.

తమిళ చిత్రం ‘తమిజాన్‌’తో నాయికగా కెరీర్‌ మొదలుపెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ బాలీవుడ్‌లో స్టార్‌ కథానాయికగా ఎదిగింది. జాతీయస్థాయి ఉత్తమ కథా నాయికగా పురస్కారం అందుకుంది. నటిగా ఉన్నతస్థాయికి ఎదిగినా ఇంకా త‌ను చేయాల్సి ఉంద‌ని, ద‌య‌చేసి త‌న బ‌యోపిక్ తీయోద్ద‌ని కోరింది ప్రియాంక‌. ‘మాట్రిక్స్‌’, ‘టెక్ట్స్‌ ఫర్‌ యు’తో పాటు పలు హాలీవుడ్‌ చిత్రాలు ఆమె చేతిలోఉన్నాయి.

priyanka chopra

ప్రియాంక ఇటీవ‌ల త‌న 39వ బ‌ర్త్‌డేని జ‌రుపుకోగా, ఆమెకు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ క్ర‌మంలో త‌నకు విషెస్ తెలిపిన వారంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ హాట్ ఫొటో ఒక‌టి షేర్ చేసింది. స్విమ్ సూట్ లో అందాలు ఆరోబోస్తూ సోష‌ల్ మీడియాని షేక్ చేసింది. వ‌య‌సు పెరిగినా కూడా త‌ర‌గ‌ని అందంతో ప్రియాంక చోప్రా మ‌తులు పోగొడుతుంది.

ప్రియాంక చోప్రా ఫోటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుండగా, ఈ ముద్దుగుమ్మ‌ని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ప్రియాంక ఈ పుట్టిన రోజుకు త‌న భ‌ర్త‌కు దూరంగా లండ‌న్‌లో ఉంది. షూటింగ్ నిమిత్తం లండ‌న్‌కు వెళ్ల‌డంతో ఆమెకు ఖరీదైన వైన్‌ బాటిల్‌ను నిక్ బహుమతిగా పంపించాడు. ఆ బాటిల్‌ ఫొటోను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది ప్రియాంక.