Priyanka chopra: గ్లోబల్ భామగా కీర్తి ప్రతిష్టలు పొందిన ప్రియాంక రీసెంట్గా తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. నిక్, ప్రియాంక 2018 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. రాజస్తాన్లోని ఉమైద్ భవన్ రాజభవనంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. క్రిస్టియన్ పద్ధతిలో ఓసారి, హిందూ సంప్రదాయంలో మరోసారి వీరి పెళ్లి జరిపించారు.సరోగసి ద్వారా ప్రియాంక- నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు.


ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి. ధన్యవాదాలు..’ అని రాసుకొచ్చింది.
అయితే తాజా సమాచారం మేరకు.. ప్రియానిక్ జంట కుమార్తె ఇంకా హాస్పిటల్ లోనే ఉంది. దానికి కారణం నెలలు నిండకుండానే ఈ బిడ్డ జన్మించడమేనని తెలుస్తోంది. 12 వారాల ముందే పీసీ కుమార్తె జన్మించిందిట. కుమార్తె పుట్టిందని ఎంత సైలెంట్ గా వెల్లడించిందో పీసీ ఇప్పుడు అంతే సైలెంటుగా రెండో బిడ్డను సరోగసీలోనే ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఏప్రిల్ నెల వరకూ మొదటి బిడ్డ ఆస్పత్రిలోనే ఉంటుంది. అప్పటి వరకూ పీసీ తన షెడ్యూల్స్ ని దానికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా పాపకే అంకితమవుతుందట.

రెండో బిడ్డను కనేందుకు పీసీ ఎగ్జయిట్ అవుతోంది. సదరన్ కాలిఫోర్నియా హాస్పిటల్ లో తొలి బిడ్డ ఉండగానే.. ప్రియానిక్ జంట ఈ ప్లాన్ ని అమల్లో పెడుతున్నారట. కానీ ఈ వార్తను ప్రియాంక చోప్రా ధృవీకరించాల్సి ఉంంది. ఇక పీసీ నటించిన మ్యాట్రిక్స్ 4 చిత్రం ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. ఈ సినిమా ఆస్కార్ అవార్డుల్లోనూ పోటీ పడుతోంది.