PRIYANKA: వ‌య‌స్సు అయిపోతుంద‌ని ఒప్పుకున్న గ్లోబ‌ల్ బ్యూటీ.. అవాక్క‌వుతున్న ఫ్యాన్స్

సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన అందాల భామ‌ల త‌మ వ‌య‌స్సు క‌నిపించ‌కుండా ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటారో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. యోగా, జిమ్, ఆహాన నియ‌మాలు ఇలా ప్ర‌తి ఒక్క విష‌యంలో శ్ర‌ద్ధ వ‌హిస్తూ చాలా య‌వ్వ‌నంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. వ‌య‌స్సు పెరుగుతున్న‌ప్ప‌టికీ దానిపై నోరు విప్పేందుకు ఏ మాత్రం ఆస‌క్తి చూప‌రు. కాని గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మాత్రం వయసు అయిపోతోందని వృద్ధురాలిని అయిపోతున్నానని కలత చెందుతోంది . వయసు పెరుగుతోందని నిజాయితీగా అంగీకరించడమే గాక.. ఆ ఆలోచన తనను పదే పదే వెంటాడుతోందని కూడా చెప్పారు.

Priyanka Chopra
 

బాలీవుడ్‌లో మంచి హీరోయిన్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో ప్రియాంక చోప్రా ..అమెరికన్‌ పాప్‌ సింగర్‌ నిక్‌జోనస్‌ని 2018లో వివాహం చేసుకుంది. 38 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ప్రియాంక తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్‌ను ప్రేమ వివాహం చేసుకొని అనంతరం ఆమెరికాకు వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడే హాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఇటీవల అక్కడి యాహు లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. “నా శరీరం గురించి నాకు బాగా అనిపించని రోజులలో కూడా .. ఇతర విషయాల గురించి మంచి అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తాను“ అని పీసీ తెలిపింది.

నేను వృద్ధాప్యం బారిన పడనని అబద్ధం చెప్పను. వ‌య‌స్సు పెరుగుతున్న కొద్ది శ‌రీరం మారిపోతుంది. నా శ‌రీరానికి క్యాట‌రింగ్ సరిగానే ఉంది. 10, 20 సంవ‌త్స‌రాల క్రితం నా బాడీ ఇలా లేదు . శ‌రీర సమ‌స్య‌లు మ‌న‌ల్ని ప్ర‌భావితం చేస్తున్న స‌మ‌యంలో మ‌నం ఇత‌ర విష‌యాల‌తో అనుభూతి చెందాలి. అప్పుడు వాటితో చాలా సంతోషం క‌లుగుతుంది . ప్రస్తుతం తన శరీరం ఇలా ఉందంటూ ప్రియాంక లేటెస్ట్ ఫొటో షేర్‌ చేసింది. ఇప్పుటి శరీరానికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు పాటిస్తున్నానంటూ కామెంట్ పెట్టింది. ప్రియాంక చోప్రా గ్లోబల్ ఐకన్.. ప్రతిభతో బాలీవుడ్ హాలీవుడ్ రెండింటిలోనూ తనదైన ముద్ర వేసింది. హాలీవుడ్ లో `టెక్స్ట్ ఫర్ యు` అనే చిత్రంతో పాటు రస్సో బ్రదర్స్ సిటాడెల్ లో.. కీను రీవ్స్ మ్యాట్రిక్స్ 4 లోనూ పీసీ నటిస్తోంది.