Priyanka Chopra : పిల్ల‌ల ప్లానింగ్‌పై స్పందించిన స్టార్ హీరోయిన్..!

Priyanka Chopra : ఇండియన్ సినిమాలో సుదీర్ఘ కాలం పాటు స్టార్‌డమ్‌ను కొనసాగించుకుంటూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన అందాల ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఈ అమ్మ‌డు ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఫేమస్ అయ్యారు. ఎన్నో అంచనాలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అనతి కాలంలోనే అదిరిపోయే రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది.అదే సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

Priyanka Chopra and nick jonas plan about kids
Priyanka Chopra and nick jonas plan about kids

ఇక, ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. హాట్ హాట్ ఫొటోల‌తోను ర‌చ్చ లేపుతుంది. ఈ ముద్దుగుమ్మ అందాల ఆర‌బోత‌కు అంద‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్నాక అమెరికాలో స్థిరపడిన సంగతి తెలిసిందే. ఈ జంట దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టి మూడేళ్లు దాటింది.

వీళ్లిద్దరి అన్యోన్యత గురించి చెప్పాల్సిన పనిలేదు. దేశాలు వేరైనా..మతాలు వేరైనా ఆ జంట అన్యోన్యత మాత్రం చూడ మచ్చటగా ఉంటుంది. ప్రేమలో కొలమానాలు ఉండవు అని చెప్పడానికి ఈ జంటని ఉదహరించొచ్చు. ఇంకా చెప్పాలంటే నిక్ అంటే పీసీకి ప్రాణం. ఇలా ఈ జంట వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. కెరీర్ పరంగానూ ఎవరి బిజీలో వారు ఉన్నారు. అప్పుడప్పుడు ముంబై వచ్చి వెళ్తుంటారు.

మరి ఈ జంట ఇంకా పిల్లల్ని ప్లాన్ చేయాలేదా? అంటే ఆ ప్రశ్నకి తాజాగా పీసీ సమాధానం చెప్పింది. వానిటి ఫెయిర్ చాటింగ్ లో పిల్లల ప్రస్తావన రావడంతో పీసీ ఎలాంటి దాపరికాలు లేకుండా తన ప్రణాళికలు ఎలా ఉన్నాయన్నది చెప్పింది. “పిల్లలు అనే కోరిక జీవితంలో అతి పెద్ద భాగం. దేవుడి దయతో అది జరిగినప్పుడు జరుగుతుంది అని పీసీ తెలిపింది.

అలాగే పిల్లలు కలిగి తర్వాత పనిలో ఒత్తిడి..వేగం తగ్గించుకుంటారా? అని ప్రశ్నిచంగా అందుకు ప్రియాంక చోప్రా..నిక్ జానాస్ తప్పకుండా.. పిల్లల కంటే వేరే ప్రపంచం ఏముంటుందని బదులిచ్చారు. అలాగే నటిగా ఈ ఏడాది మాత్రం అంత బిజీగా ఉండటం ఇష్టం లేదు.ఇంటి దగ్గర కుటుంబంతోనే ఎక్కువ సమయంగా గడపాలని ఉందని పీసీ తెలిపింది.