Priyamani: తల్లి ఎప్పుడు అవుతుందో చెప్పిన ప్రియ‌మ‌ణి

Priyamani: ప్రియ‌మ‌ణి..ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ‌. 2017లో ముస్తాఫారాజ్‌ని వివాహం చేసుకున్న ప్రియ‌మ‌ణి ఇక సినిమాల‌కు దూరం అవుతుందని అంద‌రు అనుకున్నారు. కాని ఇప్పుడు బుల్లితెర‌, వెండితెర, డిజిట‌ల్ మీడియాలో స‌త్తా చాటుతుంది.

ఇటీవల ‘ది ఫ్యామిలి మెన్ 2’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ఈ వెబ్ సిరీస్‌తో ప్రియ‌మ‌ణికి దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ద‌క్కింది. సురేష్ ప్రొడక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు (నారప్ప, విరాటపర్వం) చేస్తున్న ప్రియ‌మ‌ణి ఇత‌ర సినిమాల‌లో ముఖ్య‌మైన పాత్ర‌లు పోషిస్తుంది. మూడు ప్యాన్ ఇండియా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ‘మైదాన్’లో త‌న పోర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంప్లీట్ చేయ‌గా, కెరీర్‌పై సంతృప్తిక‌రంగా ఉంది ప్రియ‌మ‌ణి.

ప్రియ‌మ‌ణి న‌టించిన నారప్ప జూలై 20న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో ముచ్చటించింది. తెలుగులో ‘నారప్ప’లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. తమిళంలో విలేజ్‌ క్యారెక్టర్లు చేశాను కాబట్టి తెలుగులో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పుకొచ్చింది. నార‌ప్పలో సుంద‌రమ్మ పాత్ర‌లో క‌నిపించ‌నున్న ప్రియ‌మ‌ణి విరాట ప‌ర్వంలో భార‌త‌క్క‌గా క‌నిపించి అల‌రించ‌నుంది.

మంజు వారియ‌ర్ పాత్ర‌ని ప్రియ‌మ‌ణి చేస్తుండ‌డంపై స్పందించగా, రీమేక్‌ చేసేటప్పుడు పోలికలు పెడతారు. ఏమీ చేయలేం. అది సహజం. మంజు వారియర్‌ అద్భుతమైన నటి. అయితే నా బెస్ట్‌ ఇవ్వడానికి ట్రై చేశాను. ఎంత చేయాలో అంతా చేశాను. పేరు వస్తే హ్యాపీ అని చెప్పుకొచ్చింది.ఇక సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌లో తల్లి పాత్రలు చేస్తున్నారు. మరి.. రియల్‌ లైఫ్‌లో ఎప్పుడు అని ప్ర‌శ్నించ‌గా, అందుకు నవ్వుతూ ..ఇప్పుడు కాదండీ.. కొంచెం టైమ్‌ పడుతుంది అని స్ప‌ష్టం చేసింది.

ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి భ‌ర్త యూఎస్‌లో త‌న ప‌నుల‌తో బిజీగా ఉన్నార‌ట‌. క‌రోనా టైంలో ఎవరు ఎక్కడ ఉన్నా సేఫ్టీగా ఉండటం ముఖ్యం. ఆ విషయంలో మేం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని ప్రియ‌మ‌ణి చెప్పుకొచ్చింది.