Priya Prakash: మ‌ల్లెపూల చాటున దాగిన ప్రియా ప్ర‌కాశ్ అందాలు..!

Priya Prakash: కొన్ని రోజుల ముందు వ‌ర‌కు ప్రియా ప్రకాశ్ వారియ‌ర్ దేశ వ్యాప్తంగా ఓ సంచ‌ల‌నం. కొంటె సైగతో మొత్తం దేశ యువతను కళ్లు తిప్పుకోకుండా చేశారు . ‘వింక్‌ సెన్సేషన్‌’ అంటూ గూగుల్లో, యూత్‌ గుండెల్లో ట్రెండ్‌ అయిపోయారీ బ్యూటీ. కొందరబ్బాయిలైతే ఈ బ్యూటీ బొమ్మను గుండెల్లో పచ్చబొట్టేసుకున్నారు. మలయాళంలో ప్రియా నటించిన ‘ఒరు అధార్‌ లవ్‌’ చిత్రంలోని సాంగ్‌లో భాగంగా క‌న్ను కొట్టి అంద‌రి దృష్టిని ఆకర్షించింది ప్రియా.

తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెల‌చుకున్న ప్రియా ప్రకాశ్ ప‌లు ఆఫ‌ర్స్ అందుకుంటూ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇటీవ‌ల తేజ స‌జ్జాతో క‌లిసి ‘ఇష్క్‌` చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

ఇక నితిన్ స‌ర‌స‌న చెక్ చిత్రంలో రెండో హీరోయిన్‌గా న‌టించింది. ఇందులో అందాల ఆర‌బోత చేసిన ఈ అమ్మ‌డికి పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.త‌న‌కు మలయాళ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్‌ల అభిరుచులు తెలుస‌ని, తెలుగు ప్రేక్షకుల మ‌న‌సుకు న‌చ్చేలా సినిమాలు చేస్తున్నానంటుంది.

తెలుగు భాషను నేను అర్థం చేసుకోగలను. భవిష్యత్‌లో పూర్తిగా తెలుగులో మాట్లాడతానన్న నమ్మకం ఉంది. ఇందుకు తగ్గ శిక్షణ తీసుకుంటున్నాను. టాలీవుడ్‌ నా సెకండ్ హోమ్ అని కూడా చెప్పి నిర్మాత‌ల‌కు మెల్ల‌గా గాలం వేస్తుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో అందాలు ఆరోబోస్తూ ఆక‌ర్షిస్తుంది.

ప్రియా ప్రకాష్ వారియర్ ఓన‌మం సంద‌ర్భంగా షేర్ చేసిన‌ స్పెషల్ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. చేతిలో మల్లెపూల దండ, పైట లేకుండా కనువిందు చేస్తోన్న అందాలు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్‌కి కంటిపై క‌నుకు లేకుండా పోయింది.