Mahesh Babu : రాజమౌళి కోసం అతిపెద్ద త్యాగం చేస్తోన్న మహేశ్ – బాహుబలిని మించిన స్క్రిప్ట్ ఇది!

Mahesh Babu : టాలీవుడ్ టాపెస్ట్ డైరెక్టర్ రాజమౌళితో కనీసం ఒక్క సినిమా తీసినా చాలనుకునే బిగ్ హీరోల లిస్టులో ప్రిన్స్ మహేశ్ బాబు కూడా చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ కోసం దుబాయ్ లో ఉన్న ఆయన ఈ ఫిల్మ్ చిత్రీకరణ సెప్టెంబరులో పూర్తయ్యాక మరే ప్రాజెక్టుకీ పచ్చజెండా ఊపకూడదనే ఆలోచనలో ఉన్నారట. ఇతర చిత్రాలను ఒప్పుకుంటే రాజమౌళి ఆఫర్ మిస్ అవుతుందేమోననేదే ప్రిన్స్ అనుమానమని సమాచారం. దీన్నిబట్టి మహేష్ బాబు జక్కన్న కోసం ఎంత పెద్ద త్యాగం చేస్తున్నాడో అనుకుంటున్నారు.

పక్కా..

మహేష్ బాబు, నా కాంబినేషన్ లో ఒక ప్రాజెక్టు ఉండటం ఖాయం అని రాజమౌళి గతంలో చాలా సార్లు చెప్పాడు. దీనికి ప్రిన్స్ కూడా సూచాయగా సై అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న రాజమౌళి ఈ బొమ్మని దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి డేట్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యాక కొన్నాళ్లు రెస్ట్ తీసుకొని అప్పుడు మహేష్ బాబు పిక్చర్ కి ప్లాన్ చేయాలని జక్కన్న లెక్కలేస్తున్నాడు.

బాహుబలి: Mahesh Babu 

రాజమౌళి ఫస్ట్ టైమ్ ప్రిన్స్ తో తీయబోయే సినిమా స్క్రిప్ట్ బాహుబలికి మించిన లెవల్లో ఉంటుందని భావిస్తున్నారు. హాలీవుడ్ జేమ్స్ బాండ్ కథలా పక్కా జక్కన్న మార్కుతో స్పై థ్రిల్లర్ గా రూపొందిస్తారని చెబుతున్నారు. ఈ విషయమై రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో లాక్ డౌన్ సమయంలో కొంత వరకు చర్చలు జరిపారని అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అనంతరం తీసుకోబోయే గ్యాప్ లో పూర్తి స్థాయిలో స్క్రిప్టుపై చర్చిస్తారని టాక్. ఇదంతా జరిగే సరికి కనీసం ఐదారు నెలలు పడుతుందని, అయినా మహేష్ బాబు పక్కచూపులు చూడదల్చుకోలేదని, రాజమౌళి కోసమే కాచుకొని కూర్చుంటాడని ఇండస్ట్రీ వర్గాలు బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి.

Prince Mahesh Babu : sacrificing for rajamouli
Prince Mahesh Babu : sacrificing for rajamouli

వాటే ఐడియా..

ప్రిన్స్ తో సినిమాలు తీయటానికి చాలా మంది నిర్మాతలు, దర్శకులు వెయింటింగ్ లిస్టులో ఉన్నారు. రెమ్యునరేషన్ కూడా మహేష్ బాబు ఎంత అడిగితే అంత ఇవ్వటానికి సై అంటున్నారు. తన కోసం ఎంతో మంది వేచిచూస్తుంటే తానేమో రాజమౌళి కోసం ఎదురుచూస్తున్నాడు. జక్కన్నకు గానీ తనకు గానీ మనసు మారితే కష్టమన్నట్లు ప్రిన్స్ ముందుచూపుతో వ్యవహరిస్తున్నాడని సినీ విశ్లేషకులు వివరిస్తున్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్.. వాటే ఐడియా అంటూ ముచ్చటపడుతున్నారు.

Advertisement