Priyamani: ఢీ షోకు వెంక‌టేష్‌ని తీసుకురావాల‌ని ప్రియమ‌ణిపై ఒత్తిడి

Priyamani: ఒక‌ప్ప‌టి అందాల తార ప్రియ‌మ‌ణి పెళ్లి త‌ర్వాత కొంత కాలం పాటు సినిమాలు త‌గ్గించింది. మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమాలు, షోస్‌తో బిజీగా ఉంది. సినీరంగంలో పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా ప్రయాణాన్ని సాగిస్తున్న సీనియ‌ర్‌ క‌థానాయిక ఇప్పుడు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో అల‌రిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మ‌డు నార‌ప్ప‌, విరాట ప‌ర్వం అనే చిత్రాల‌లో న‌టించగా నార‌ప్ప చిత్రం జూలై 20న విడుద‌ల కానుంది.

Priyamani
Priyamani

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ సినిమా అసురన్‌కు తెలుగు రీమేక్‌గా వస్తున్న చిత్రం ‘నారప్ప’. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 20న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల విడుదలైంది. నారప్ప ఓటీటీలో విడుదలవ్వడం తన అభిమానులను కాస్త నిరాశ పరిచిందని తెలిపారు. అయితే ఈ కొవిడ్ సమయంలో ప్రజలను అల‌రించేందుకు ఇంత క‌న్నా వేరే ఆప్ష‌న్ లేద‌న్నారు వెంకీ.

ఇక చిత్రంలో సుందరమ్మగా న‌టించింది ప్రియ‌మ‌ణి. ఈమె సినిమాపై చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ప‌లు ఛానెల్స్‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్న ప్రియ‌మ‌ణి తాజా ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.నార‌ప్ప సినిమాలో త‌న పాత్ర‌, వెంకీ పాత్ర డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. ఢీ టీం కూడా సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఢీ టీం నారప్ప టీంకు ఇచ్చిన స‌ర్‌ప్రైజ్ చాలా బాగుంది. మా డైరెక్ట‌ర్ వెంక‌టేష్ సార్ కి పెద్ద ఫ్యాన్. ఆయ‌న వెంకీ స‌ర్‌ని ఢీ షోకు తీసుకురావాల‌ని ప‌ట్ట‌బ‌ట్టాడు. మిగ‌తా వారు కూడా షోకి తీసుకురావాల‌ని నాపై ఫోర్స్ చేస్తున్నారు. వీలున్న‌ప్పుడు వెంకీ స‌ర్‌ని ఢీషోకి త‌ప్ప‌క తీసుకొస్తా అని చెప్పుకొచ్చింది ప్రియ‌మ‌ణి.

సుడిగాలి సుధీర‌, ప్ర‌దీప్ తో పాటు మా టీం అంద‌రు నార్ప‌ప కోసం చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాం. ఇది మిమ్మ‌ల్ని త‌ప్ప‌క అల‌రిస్తుందని ప్రియ‌మ‌ణి చెప్పుకొచ్చింది. వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన నార‌ప్ప సినిమాకు మణి శర్మ సంగీతం అందించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఒరిజినల్ వెర్షన్ కి ఎక్కడా తగ్గకుండా శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ కానీ చూపించిన విజువల్స్ కానీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే వెంకటేష్, ప్రియమణిల నటన మరో ఎత్తుకు తీసుకెళ్తుందని చెప్పోచ్చు.