Pooja hegde : పూజా హెగ్డే లైఫ్ లో ప్రేరణ చాలా స్పెషల్..

Pooja hegde : పూజా హెగ్డే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలో యావరేజ్ హిట్స్‌తో నెగిటివ్ కామెంట్స్ అందుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో చేసిన మొహంజాదారో కూడా భారీ డిజాస్టర్. మళ్ళీ బాలీవుడ్ జనాలు పూజాని పట్టించుకోలేదు. టాలీవుడ్‌లో దువ్వాడ జగన్నాథం సినిమాతో బికిని వేసి మతులు పోగొట్టింది. అయినా సక్సెస్ దక్కలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన మహర్షి సినిమాతో పూజా ఫస్ట్ హిట్ అందుకుంది.

prerana is very special for pooja-hegde-
prerana is very special for pooja-hegde-

ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో పూజా హెగ్డే గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. గద్దలకొండ గణేష్, అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు వరుసగా సూపర్ హిట్ కావడంతో ఈ పొడుగు కాళ్ళ సుందరి బాగా హైలెట్ అయింది. అంతేకాదు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.

Pooja hegde : ఇప్పటి వరకు పోషించిన పాత్రల కంటే ప్రేరణ ఎంతో ప్రత్యేకం..!

రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కెరీర్ లో ఇప్పటి వరకు చేయనటువంటి పాత్ర రాధే శ్యామ్ లో చేస్తోంది. ప్రేరణగా అలరించబోతోంది. అయితే ఈ పాత్ర పూజా కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిలుస్తుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇండస్ట్రీలో కూడా పూజా పోషిస్తున్న ప్రేరణ పాత్ర ఆమెకి పాన్ ఇండియన్ లెవల్ లో క్రేజ్ తీసుకు రావడం గ్యారెంటీ అంటున్నారు. ఇక పూజా కూడా తన కెరీర్ లో ఇప్పటి వరకు పోషించిన పాత్రల కంటే ప్రేరణ ఎంతో ప్రత్యేకం అని చెబుతోంది. చూడాలి మరి ఈ పాత్రతో పూజాకి ఎలాంటి క్రేజ్ వస్తుందో.