CHITRAM: చిత్రం మూవీకు సీక్వెల్‌.. ఈ ఏడాదిలోనే షూటింగ్ !

టాలీవుడ్ లో తనకంటూ ఓ ఫేమ్ ను సృష్టించుకున్న దర్శకుడు తేజ.. డైరెక్టర్ గా అరంగ్రేటం చేసిన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో ట్రెండ్ సృష్టించాడు. సినిమాలపై ఉన్న క్రేజ్ తో చిత్రం తో అడుగు పెట్టి.. నువ్వు నేను అంటూ యువతను ఉర్రుతలూగించి.. ఔనన్నా కాదన్నా అంటూ నిజం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తేజ స్పెషాలిటీ. తక్కువ బడ్జెట్ తో ఉదయ్ కుమార్, రీమాసేన్ , చిత్రం శీను వంటి అనేక కొత్త నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది.

అయితే ఈరోజు దర్శకుడు తేజ పుట్టిన రోజు సంధర్భంగా తాను మొదటగా డైరెక్ట్ చేసిన చిత్రం సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నట్లు అధికారకంగా ప్రకటించారు. రీసెంట్ గా ఈ సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన మూవీ చిత్రం. కాలేజ్ లవ్ స్టోరీల మోటివ్ తో ఎన్నో సినిమాలే వచ్చాయి. కానీ పెళ్ళికి ముందే ఉదయ్ కిరణ్, రీమాసేన్ లు తల్లిదండ్రులు కావడం.. ఇటు ఫ్యామిలీలో, అటు సొసైటీలో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారనే అంశాలతో డైరెక్టర్ తేజ ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమాకు అందరి ఆధరణ లభించింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల యాక్టింగ్ హైలెట్ గా నిలిచింది.

ఈ సినిమాలో ఆర్.పి.పట్నాయక్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కేవలం 44 లక్షలతో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల పరంగా పెద్ద సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం విశేషం. అయితే ఇప్పుడు తేజ అనౌన్స్ చేసిన చిత్రం 1.1 అనే సినిమా ఈ ఏడాది షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. మరి ఈ సినిమా కూడా ఇదే రేంజ్ లో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుందా.. లేక ఈ సినిమా సీక్వెల్ అప్డేట్ వెర్షన్ లో ఉంటుందా అనేది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాక్.

Advertisement