Premi Vishwanath: ట్రెడిష‌న‌ల్ లుక్ నుండి మోడ్ర‌న్ లుక్‌లోకి వంట‌ల‌క్క‌.. అవాక్క‌వుతున్న ఫ్యాన్స్

Premi Vishwanath: బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌ది ఓ చరిత్ర. నెవ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ‌ర్ట్ అన్న‌ట్టు ఈ సీరియ‌ల్ స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఇందులోని ప్ర‌తి పాత్ర జ‌నాల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క, హిమ, శౌర్య, మోనిత, సౌందర్య పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ కార్తీకదీపం టీం హల్చల్ చేస్తుంటుంది.

Premi Vishwanath

డాక్టర్ బాబు, కార్తీక్ క్యారెక్టర్‌లో నిరుపమ్ నటనకు అందరూ ఫిదా అవుతుంటారు. వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్‌కు వేరే లెవెల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండ‌క‌పోయిన ఎప్పుడైన పోస్ట్ పెట్టిందంటే మాత్రం విప‌రీతంగా లైకులు చేస్తుంటారు.

కార్తీక దీపం సిరీయ‌ల్‌లో వంట‌ల‌క్క‌గా ఫేమ‌స్ అయిన ప్రేమి విశ్వ‌నాథ్ చీరకట్టులో అనుకువ, సహనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అనేక ట్విస్ట్‌ల‌తో సాగుతున్న ఈ కార్య‌క్ర‌మంను డైరెక్ట‌ర్ ఎలాంటి మ‌లుపుల‌తో ముగిస్తాడో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. ‘కార్తీక్‌, మోనిత పెళ్లి అయిపోతుంది, ఆ తర్వాత వంటలక్క వెళ్లిపోతుంది.. వెంటనే కార్తీకదీపంకు శుభం కార్డు’ అంటూ చర్చించుకుంటున్నారు.

దాదాపు చాలా ఏళ్ల నుండి కార్తీక దీపం సీరియ‌ల్‌కే ప‌రిమిత‌మైన వంట‌ల‌క్క మ‌రో సీరియ‌ల్‌కి సైన్ చేయ‌లేదు.తాజాగా ఓ మ‌ల‌యాళ సీరియ‌ల్‌కి సైన్ చేసింది. ఈ విష‌యాన్నిత‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. త్వ‌ర‌లో ప్రేమి న‌టించిన దేవికా అనే సీరియల్‌ ప్రసారం కాబోతుంది. ఈ సీరియల్‌కు సంబంధించిన ప్రోమోను ఆమె తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. ఇందులో వంటలక్క మోడ్రన్‌ డ్రెస్‌లో స్టైలిష్‌ లుక్‌తో కనిపించి అందరికి షాక్‌ ఇచ్చింది.

Premi Vishwanath

దేవికా అనే సీరియ‌ల్ , సోమవరం (జూలై 5) నుంచి రాత్రి 8 గంటలకు సూర్య టీవీలో ప్రసారం అవుతున్నట్లు ఈ ప్రోమోలో ప్రేమి వెల్లడించింది. కార్తీకదీపంలో చాలా పద్దతిగా, సంప్రదాయం ఉన్న వంటలక్క ఇలా ట్రెండీ లుక్‌లో క‌నిపించే స‌రికి అవాక్క‌వుతున్నారు. ఇందులో పొగ‌రుగా, సంప‌న్నురాలిగా క‌నిపిస్తుంద‌ని ప్రోమోని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. ఏదేమైన కార్తీక దీపం ద్వారా చాలా ఫాలోయింగ్ పెంచుకున్న వంట‌ల‌క్క ఇప్పుడు ఈ సీరియ‌ల్‌తో మ‌రింత‌గా పెంచుకోవాల‌ని భావిస్తుంది.