Prema Vishwanath: ఇక వెండితెర‌పై వంట‌ల‌క్క సంద‌డి.. ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

Prema Vishwanath: కార్తీక దీపం సీరియ‌ల్‌లోవంట‌ల‌క్క‌గా మంచి పేరు తెచ్చుకున్న న‌టి ప్రేమి విశ్వ‌నాథ్. ఈ అమ్మ‌డు సీరియ‌ల్‌లో దీప‌గా, వంట‌ల‌క్క‌గా త‌న‌లో డిఫ‌రెంట్ షేడ్స్ చూపించి ఔరా అనిపిస్తుంది. దాదాపు మూడున్నరేళ్లుగా.. 1082 ఎపిసోడ్‌లతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వంటలక్క తెలుగు రాష్ట్రాల్లో సంచలన నటిగా సత్తా చాటుతోంది. ఏ రోజు కూడా వంట‌ల‌క్క త‌న ఫ్యాన్స్ కి బోర్ కొట్టించ‌కుండా వినోదం అందించేలా ప్ర‌య‌త్నిస్తుంది.

Prema Vishwanath into Movies1
Prema Vishwanath into Movies1

అనేక‌ ట్విస్ట్‌ల‌తో సాగుతున్న కార్తీక దీపం సీరియ‌ల్ తుదిద‌శ‌కు చేరుకున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లో వంట‌ల‌క్క అద్భుత‌మైన ట్విస్ట్‌తో ఈ సీరియ‌ల్‌కి ఎండ్ కార్డ్ వేయ‌నుంది. అయితే ఈ అమ్మ‌డు ‘దేవిక’ అనే కొత్త మలయాళ సీరియల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 5 నుంచి సూర్య టీవీలో రాత్రి 8 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుండగా.. దీనికి సంబంధించిన ప్రోమోను తన ఫేస్ బుక్‌లో షేర్ చేసింది మన వంటలక్క.

కార్తీక దీపం సీరియ‌ల్‌లో సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించిన ప్రేమి విశ్వ‌నాథ్‌… దేవిక సీర‌య‌ల్‌లో మోడ్ర‌న్ లుక్‌లో కనిపించ‌నుంది. భాష అర్థం కాకపోయినా సరే వంటలక్క కోసమైన దేవిక సీరియల్‌ని చూసేట్టుగానే ఉన్నారు మ‌న తెలుగు ఫ్యాన్స్. అయితే వెండితెర‌పై కూడా స‌త్తా చాటాల‌ని ప్రేమి భావిస్తుంది. ఈ క్ర‌మంలోనే వంటలక్కను ఆన్‌ వెండితెర అంటూ… నెట్టింట వైరల్ అవుతున్నారు.

రామ్ పోతినేని హీరోగా.. తమిళ్ స్టార్‌ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే క‌దా! బై లింగువల్ గా… యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ కీరోల్ ప్లే చేస్తున్నారంటూ… ఓ న్యూస్‌ ఇటు సోషల్ మీడియాలోనూ… అటు ఇండస్ట్రీలోనూ వైరల్ అవుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు.

తాజాగా వంటలక్క అలియాస్ ప్రేమీ.. డైరెక్టర్‌ లింగుస్వామిని కలిశానంటూ ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో “మన పాపం వంటలక్క” రామ్, లింగుస్వామి సినిమాలో నటించనున్నారనే టాక్‌ నెట్టింట గట్టిగా వినిపిస్తోంది. కాని ఇది నిజమా అబద్దమా అనే విషయం రానున్న రోజులో తేల‌నుంది. ఇటీవ‌లే రామ్ న్యూ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లిన విష‌యం తెలిసిందే.