preity zinta: క‌వ‌ల పిల్ల‌ల‌కు త‌ల్లైన ప్రీతి జింతా.. సంతోష‌క‌ర వార్తను సోష‌ల్ మీడియా ద్వారా తెలిపిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి

preity zinta : సొట్ట బుగ్గ‌ల సుంద‌రి ప్రీతి జింతా.. 2016 ప్రారంభంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29న జీనీ గుడెనఫ్ అనే వ్యక్తితో ప్రీతి వివాహం జరిగింది. అమెరికాలో ఓ హైడ్రాలిక్ కంపెనీ ఫైనాన్స్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ ఇతను. పేద్ద రాయల్ ఫ్యామిలీ వ్యక్తి. ప్రీతి-జీని లది ప్రేమ వివాహం కూడా. అమెరికాలోనే ఓ ప్రైవేటు కార్యక్రమం మాదిరిగా సన్నిహితులు-స్నేహితుల మధ్య ఈ పెళ్లి కార్యక్రమం పూర్తయిపోయింది.

preity zinta welcome twins2
preity zinta welcome twins2

ముంబైకి వ‌చ్చాక ఓ ప్రైవేట్ పార్టీ ద్వారా త‌న భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేసింది ప్రీతి జింతా.అయితే తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా గుడ్ న్యూస్ చెప్పింది ప్రీతి. ప్రీతి జింతా, జీన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. దీనితో ప్రీతి జింతా ఫ్యామిలిలో సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

ఈ హ్యాపీ న్యూస్ ని స్వయంగా ప్రీతి జింతా సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. సరోగసి విధానం ద్వారా ప్రీతి జింతా, జీన్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ‘హాయ్.. ఈరోజు మీతో నేను ఒక అమేజింగ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను. నేను, జీన్ ఎంతో సంతోషంతో ఈ వార్తని ప్రకటిస్తున్నాం. మా జీవితాల్లో సంతోషం, వెలుగు నిండేలా కవల పిల్లలని పొందాము.

ఈ కొత్త ప్రయాణం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సరోగసి ద్వారా మాకు పిల్లలు పుట్టడంలో సహకరించిన డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు’ అని ప్రీతి జింతా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. దీంతో ప్రీతి జింతాకు శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తుంది.

preity zinta welcome twins1
preity zinta welcome twins1

తన పిల్లలకు జై జింటా, గియా జింటా పేర్లు కూడా ఫైనల్‌ చేసింది ప్రీతి జింటా. ఈ పేర్లు ఎంత క్యూట్‌గా ఉన్నాయంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఏడాదిన్నరగా ప్రీతి జింతా, గుడెనఫ్ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చినా ప్రీతి వీటిని ఖండించింది. కాని చివ‌రికి అత‌డిని వివాహం చేసుకొని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది ప్రీతి.