Preeetham Jukalaker: నువ్వు కూడా రెడీ అయ్యావా.. బ‌న్నీ స‌తీమ‌ణిని ఉద్దేశించి ప్రీత‌మ్ కామెంట్

Preeetham Jukalaker: ప్రీత‌మ్ జుకల్క‌ర్.. ఈ పేరు స‌మంత‌- నాగ చైత‌న్య విడాకుల త‌ర్వాత మారుమ్రోగిపోయింది. ఆ ఇద్ద‌రు విడిపోవ‌డానికి కార‌ణం ప్రీత‌మ్ అని చైతూ అభిమానులు ఆయ‌న‌పై మాట‌ల దాడి చేశార‌ట‌. అంతేకాదు చంపుతామ‌ని బెదిరించార‌ట కూడా. నేను సమంతను అక్క అని పిలుస్తాను. చాలా మందికి అది తెలుసు. అలాంటిది మా మధ్య ఎఫైర్ ఎందుకు ఉంటుంది.

Preeetham Jukalaker Comments on Allu Sneha Reddy
Preeetham Jukalaker Comments on Allu Sneha Reddy

ఎంతో మంది నన్ను ఆసభ్య పదజాలంతో తిడుతూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా కెరీర్‌ను నాశనం చేస్తామని హెచ్చరిస్తున్నారు. బతికుండగానే మా అమ్మ చనిపోయిందని కొన్ని వెబ్‌సైట్లు రాస్తున్నాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

మా మధ్య ఉన్న అనుబంధం గురించి నాగ చైత‌న్య‌కు స్పష్టంగా తెలుసు. నాకు, సమంతకు ఎఫైర్ ఉందని వస్తున్న కామెంట్ల గురించి నాగచైతన్య స్పందించకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన ఒక్క స్టేట్‌మెంట్ ఇస్తే పరిస్థితిలో మార్పు వ‌స్తుంద‌ని ప్రీత‌మ్ పేర్కొన్నాడు. ప్రీతమ్ జుకల్కర్ పక్కా హైదరాబాదీ.. 33 ఏళ్లుంటాయి. ఈ ఫ్యాషన్ డిజైనింగ్‌‌ని వృతిగా ఎంచుకున్నాడు.

ఫ్యాషన్ డిజైనింగ్ లోకి రావడానికి ప్రీతమ్ తల్లి దీనికి కారణమని చెప్పాలి. చిన్నప్పుడు ప్రీతమ్ వాళ్మ అమ్మ మిషన్ పైన బట్టలు కుట్టేవారు. అక్కడే ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళాలని ప్రీతమ్‌‌కి మొదటగా ఇంట్రెస్ట్ మొదలైంది. ప్రీతమ్ జుకల్కర్ ఫ్యాషన్ మ్యాగ్‌‌జైన్‌‌లు చదవడం మొదలుపెట్టాడు. ఫ్యాషన్ అండ్ టెక్స్ టైల్స్‌‌లో డిగ్రీ చేశాడు.

చాలా మంది సెలబ్స్‌కి స్టైలిస్ట్ డిజైన‌ర్‌గా ఆయ‌న ఉన్న‌ట్టు తెలుస్తుంది. బ‌న్నీ స‌తీమ‌ణి స్నేహా రెడ్డితో మంచి స్నేహబంధమే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం స్నేహారెడ్డి బన్నీ, అర్హ, అయాన్‌లు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే స్నేహా రెడ్డి జుట్టును కత్తిరిస్తుంటే.. నువ్ కూడా ఇందుకు రెడీగా ఉన్నావా? అంటూ అల్లు స్నేహారెడ్డిని ప్రీతమ్ ట్యాగ్ చేశాడు. అయితే స్నేహారెడ్డి మాత్రం ఇంకా రిప్లై ఇవ్వలేదు.