SALAAR: స‌లార్ స్పెష‌ల్ సాంగ్..క్రేజీ రూమ‌ర్స్‌తో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్‌

SALAAR యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. కేజీఎఫ్ లాంటి సూప‌ర్ హిట్ చిత్రంతో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచిన ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ అనే చిత్రం చేస్తున్నాడు ప్ర‌భాస్. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతుండగా, భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్- ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న స‌లార్ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్టు మేక‌ర్స్ కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి వ‌స్తున్న క్రేజీ రూమ‌ర్స్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ తెప్పిస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్రం ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ప్రశాంత్ నీల్ స్పెషల్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారని వచ్చింది. ఇప్పుడు కేజీయఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టితో అంటూ కొత్త ప్ర‌చారం న‌డుస్తుంది. ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది రానున్న రోజుల‌లో తేల‌నుంది.ఈ చిత్రం యాక్షన్ సినిమా అయినా సాంగ్‌తో కొన్ని నిమిషాల పాటు ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లాలని ప్రశాంత్ నీల్ డిసైడ్ అయి ఇలా స్కెచ్ వేసిన‌ట్టు స‌మాచారం.

Advertisement