Prashanth neel : ప్రశాంత్ నీల్ , ఓం రౌత్ ఇద్దరూ ప్రభాస్ త్యాగానికి షాక్ అయిపోతున్నారు !

Prashanth neel : ప్రశాంత్ నీల్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ప్రశాంత్ నీల్ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతుండగా.. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. ‌అయితే గత కొంత కాలంగా ప్రభాస్ సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు షూటింగ్ జరుగుతాయని రిలీజ్ కూడా అనుకున్న సమయానికి కావని ఒక ముద్ర పడిపోయింది. ‘బాహుబలి’ సినిమా నుంచి ప్రభాస్ నటిస్తున్న సినిమాల మేకింగ్ స్థాయి పెరిగిపోవడంతో పాటు పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ చేయాల్సి రావడమే అందుకు కారణం.

prashanth-neel-om-routh-are-shocked-regarding-prabhas-sacrifice
prashanth-neel-om-routh-are-shocked-regarding-prabhas-sacrifice

‘బాహుబలి’ రెండు భాగాల తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ కూడా దాదాపు రెండేళ్ళు ఆలస్యంగా రిలీజైంది. హాలీవుడ్ స్థాయిలో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది కాబట్టి లేటైందనుకుంటే మళ్ళీ ‘రాధేశ్యామ్’ విషయంలోనూ సేం సీన్ రిపీటవుతోంది. అంతేకాదు ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు కూడా భారీ స్థాయిలో తెరకెక్కుతుండటం తో ఇలాగే ఏళ్ళకు ఏళ్ళుగా ఎదురు చూడాల్సిందే అని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ప్రభాస్ కి ఈ విషయం అర్థమైంది. అందుకే తన సినిమాల విషయంలో ఎక్కువ సమయం తీసుకుకోకూడదని డిసైడయ్యాడు.

Prashanth neel : ఈ ఏడాది నాగ్ అశ్విన్ సినిమా కూడా సెట్స్ మీదకి తీసుకు రానున్నాడు ప్రభాస్.

ఈ క్రమంలోనే ‘సలార్’తో పాటు ‘ఆదిపురుష్’ సినిమాని కొన్ని రోజుల గ్యాప్ లోనే సెట్స్ మీదికి తీసుకు వచ్చాడు ప్రభాస్. అంతేకాదు రెండు సినిమాలను ఏక కాలంలో కంప్లీట్ చేయనున్నాడు. నెలలో 15 రోజులు ‘సలార్’కు, 15 రోజులు ‘ఆదిపురుష్’కు కేటాయించేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడట ప్రభాస్. ‘సలార్’ చిత్రీకరణ ఎక్కువగా తెలంగాణలోనే జరగనుంది. ‘ఆదిపురుష్’ ముంబయిలోనే ప్లాన్ చేశారు. ‘సలార్’ ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టు 11 న రిలీజ్ చేసేందుకు ఆల్రెడీ డేట్ లాక్ చేసుకున్నారు. ఇక ఈ ఏడాది నాగ్ అశ్విన్ సినిమా కూడా సెట్స్ మీదకి తీసుకు రానున్నాడు ప్రభాస్.

Advertisement