ప్రశాంత్ నీల్ – ఎన్.టి.ఆర్ కాంబోలో సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోయేది అప్పుడే ..!

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ఫిక్షన్ డ్రామా రౌద్రం రణం రుథిరం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్..కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

RRR: Jr NTR's first look as Bheem is a befitting late birthday gift from  Ram Charan and will leave you amazed | PINKVILLA

ఇక ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీం గా నటిస్తున్న ఎన్.టి.ఆర్.. ఈ సినిమా తర్వాత తన 30 వ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తో చేయనున్నాడు. 2021 మార్చ్ నుంచి ఈ సినిమా ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈ సినిమాని హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. అలాగే మరో సినిమాని మైత్రీ మూవి మేకర్స్ లో చేయబోతున్నాడు ఎన్.టి.ఆర్. కే.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమా కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే తయారవనుంది.

కాగా ఈ సినిమా కథా నేపథ్యం ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఇండియా – పాకిస్తాన్ విడిపోయిన కాలంలో జరిగిన పరిస్థుతుల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుందని చెప్పుకుంటున్నారు. కాగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించనున్నారని అంటున్నారు. కెజీఎఫ్ తో భారీ యాక్షన్ సినిమాలని బాగా డీల్ చేస్తాడన్న పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో గనక ఇలాంటి సినిమా తీస్తే ఇక యాక్షన్ సీక్వెన్సెస్ ఏ రేంజ్ లో ఉంటాయో అని నందమూరి అభిమానులు చెప్పుకుంటున్నారట. కాగా ఈ సినిమా 2022లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Advertisement