Prashanth Neel: ప్రశాంత్ నీల్ చేస్తున్న 5 పాన్ ఇండియన్ సినిమాలు ఇవే..

Prashanth Neel: కెజియఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడంలో ప్రశాంత్ నీల్ అదుర్స్ అనిపించాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 అనే చిత్రం చేశాడు. భారీ పీరియాడిక్ యాక్ష‌న్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను జూలైలో విడుద‌ల చేయాల‌నుకున్నా, క‌రోనా వ‌ల‌న రిలీజ్‌పై అనుమానాలు నెల‌కొన్నాయి. కెజియఫ్ చాప్టర్ 2 కోసమని అన్ని ఇండస్ట్రీల‌ నుంచి భారీ పోటీ ఉంది. దాంతో బిజినెస్ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్ట్ 2 బిజినెస్ 300 కోట్లకు పైగానే జరుగుతుంది.

Prashanth Neel

బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన కేజీఎఫ్ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. సీక్వెల్‌గా రూపొందిన సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో ఒకే రోజు విడుద‌ల చేయ‌నున్నారు. విలన్ సంజయ్ దత్, హీరో యష్ మధ్య యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయ‌ట‌. ఇదిలా ఉంటే క్లైమాక్స్‌లో మెయిన్ విలన్ అధీరాను రాఖీ చంపేసిన తర్వాత బాధ్షా అయిపోతాడు. దేశ ప్రధాని పాత్రలో నటిస్తున్న రవీనా టాండన్ తన సైన్యంతో రాఖీ భాయ్‌ను కూడా చంపించేస్తుందని తెలుస్తుంది. ఏదేమైన ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ చిత్రంతో సంచ‌ల‌నాల‌కు మారుపేరుగా మారాడు.

Prashanth Neel

అయితే రెండో భాగం విడుదలకు ముందే ఈయన డైరీ ఫుల్ అయిపోయింది. పేరుకు కన్నడ దర్శకుడు అయినా కూడా రాబోయే సినిమాలన్నీ తెలుగు హీరోలనే కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన 5 పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. మరి అవేంటో చూద్దాం..

1. సలార్
హీరో: ప్రభాస్, నిర్మాణ సంస్థ: హోంబళే క్రియేషన్స్

2. జూనియర్ ఎన్టీఆర్ సినిమా
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్

3. అల్లు అర్జున్ సినిమా
నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్

4. ప్రభాస్ సినిమా
నిర్మాణ సంస్థ: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు)

5. డివివి దానయ్యతో ఓ సినిమా

Prashanth Neel

ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్టులే కావడం గమనార్హం. 2024 వరకు ప్రశాంత్ నీల్ డైరీ ఫుల్ అయిపోయింది.