Pranitha: బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న ప్ర‌ణీత‌.. ఆమె భ‌ర్త ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాడో తెలుసా?

Pranitha బొంగరాల్లాంటి కళ్ళు.. ఉంగరాల్లాంటి జుట్టున్న బాపు గారి బొమ్మకి పెళ్ళైంది. అది కూడా సీక్రెట్ గా పెళ్ళి జరిగిపోవడంతో ఆమె అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ ప్రేక్షకులు, నెటిజన్లు కూడా అవాక్కయ్యారు. ఈ ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో నెట్టింట్లో తెగ పోస్టులు చేశారు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో తెలుగువారిని మైమరిపించింది. ఈమె బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్ళి చేసుకున్నారు. కరోనా కారణంగా అతి కొద్దిమంది సమక్షంలో తన వివాహం జరిగిందని.. తన పెళ్ళి గురించి ముందుగా అభిమానులతో చర్చించనందుకు తనను క్షమించాలని సోషల్ మీడియా వేదికగా విన్నవించుకుంది.

ఇక నెటిజన్లు, ఆమె అభిమానులు ప్రణీత పెళ్ళి చేసుకున్న నితిన్ గురించి పలు వివరాల కోసం తెగ వెతుకుతున్నారు. అసలు ఈ నితిన్ ఎవరు.. ఎన్ని వ్యాపారాలున్నాయి.. ఏం చేస్తుంటారంటూ వెతుకులాట మొదలెట్టారు. నితిన్ హాస్పిటల్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన కోర్సులో ఉన్నత విద్యను చదివారు. 2011 లో బ్లూ హారిజస్ హోటల్స్ ని ప్రారంభించి ఆ హోటళ్ళకు డైరెక్టర్ గా ఉండటంతో పాటు ఆ బిజినెస్ ను డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళుతుండటం విశేషం.

Pranitha

ప్రస్తుతం నితిన్ వ్యాపారాలు అన్నీ మంచి లాభాల్లో ఉన్నాయట. ఈ బిజినెస్ తో పాటు నితిన్ కు మరికొన్ని వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రణీత పెళ్ళి తర్వాత సినిమాల్లో నటిస్తారా.. లేదా అనేది క్లారిటీగా తెలియాల్సి ఉంది. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, బావ సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ప్రణీత టాలీవుడ్ లో బిజీగా లేకపోయినా.. వేరే సినిమా ఇండస్ట్రీలో సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా కరోనా లాక్ డౌన్ తో ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ప్రణీత కూడా ఓ ఇంటికి కోడలు కావడం ఆనందదాయకం.