Prakash Raj : మౌనవ్ర‌తం తీసుకున్న ప్రకాశ్ రాజ్ .. కార‌ణం ఏంటో తెలుసా?

Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల‌లో త‌న‌దైన డైలాగులు పేలుస్తూ కేక పెట్టిస్తుంటాడు. ముక్కుసూటిగా ప్ర‌శ్నించే త‌త్వం క‌లిగిన ఆయ‌న త‌న వాక్చాతుర్యంతో ఎదుటివారికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించ‌గ‌లడు. అయితే కొంత‌కాలం ప్ర‌కాశ్‌రాజ్ మౌనం వ‌హించ‌బోతున్నారు. మ‌ళ్లీ ఆయ‌న స్వ‌రం వినేందుకు కొంత స‌మ‌యం ప‌ట్ట‌నుంది.

Prakash Raj went silence mode for some days
Prakash Raj went silence mode for some days

ఇదే విష‌యాన్ని ట్వీట్ ద్వారా తెలియ‌జేశాడు ప్ర‌కాశ్‌రాజ్‌. ఇటీవల కాలంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల బిజీలో ఉన్న ప్రకాష్ రాజ్.. తాజాగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ తాను పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారని వెల్లడించారు. కాకపోతే ఓ వారం రోజులపాటు మౌనవ్రతం పాటించాల్సి ఉందని పేర్కొన్నారు.

Prakash Raj went silence mode for some days
Prakash Raj went silence mode for some days

”డాక్టర్స్ వద్ద కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. ఐయామ్ రాకింగ్. అయితే వోకల్ కార్డ్స్ కి మాత్రం ఓ వారంపాటు విశ్రాంతి అవసరం. అందుకే మౌనవ్రతం చేయబోతున్నా. మౌనం ఆనందాన్ని ఇస్తుంది” అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. కాగా ఎలాంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేసే ప్రకాష్ రాజ్.. హీరోగా విలన్ గా ‏క్యారక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో నటించారు.