Prakash Raj: పేద కుటుంబానికి జేసీబీ కొనిచ్చిన ప్ర‌కాశ్ రాజ్..!

Prakash Raj: మంచి త‌నానికి మారు పేరుగా ప్ర‌కాశ్ రాజ్ చెప్ప‌వ‌చ్చు. విల‌క్ష‌ణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌కాశ్ రాజ్ ఎన్నో చిత్రాల‌లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవ‌లం సినిమాల ద్వారానే కాక సేవా కార్య‌క్ర‌మాల‌తోను ఎంద‌రో మ‌న‌సుల‌లో చెర‌గని ముద్ర వేసుకున్నారు. క‌రోనా వ‌ల‌న ప్ర‌క‌టించిన లాక్ డౌన్ స‌మ‌యంలోను ప్ర‌కాశ్ రాజ్ ఏది ఆశించ‌కుండా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

Prakash Raj Help to Poor Family and Gave JCB
Prakash Raj Help to Poor Family and Gave JCB

తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన ఛారిటీ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గ్రామాన్ని దత్తత తీసుకుని సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ గ్రామం అభివృద్ది కోసం తనవంతు కృషిని అందిస్తున్నారు. ఆయన ఫౌండేషన్ కరోనా సమయంలో చాలా యాక్టివ్ గా పని చేసి అందరి యొక్క ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా మైసూర్ శ్రీరంగపట్నంకు చెందిన ఒక ఫ్యామిలీ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది.

Prakash Raj Help to Poor Family and Gave JCB
Prakash Raj Help to Poor Family and Gave JCB

వారి ప‌రిస్థితి గురించి తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ స‌ద‌రు వ్య‌క్తికి జేసీబీని బహుమానంగా అందించాడు. ఇక నుండి వారి కుటుంబం ఆనందంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఒక జీవితంలో వెలుగు నింపడం కోసం మనం సంపాదించిన దాంట్లో కొంత తిరిగి ఇస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ప్రకాష్ రాజ్ గతంలో కూడా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడు. ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించిన ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ మద్దతు ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఈయనతో పాటు మంచు విష్ణు, జీవీఎల్ నరసింహారావు, కాదంబరి కిరణ్ పోటీలో ఉన్నారు. వచ్చే నెలలో ‘మా’ ఎన్నికలు నిర్వహించడానికి అంతా సిద్ధం అయింది.