Prakash Raj: మంచు విష్ణు కుట్ర‌పై క‌న్నీరు పెట్టుకున్న ప్ర‌కాశ్ రాజ్

Prakash Raj: మా అధ్య‌క్ష బ‌రిలో నిలిచిన ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు ఒక‌రిపై ఒక‌రు మాట‌ల దాడి చేసుకుంటున్నారు. మంచు విష్ణుపై “మా” ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తమకు అనుకూలంగా వేయించుకునేందుకు మంచు విష్ణు ప్యానెల్ ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.

Prakash Raj Cried In Front Of Media Because Of Mohan Babu Betrayal
Prakash Raj Cried In Front Of Media Because Of Mohan Babu Betrayal

వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి ఇక్కడ డబ్బులు కట్టారని, వారితో ఓటు వేయించుకునే కుట్ర చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. మా ఎన్నిక‌ల్లో 60ఏళ్లు పైబడినవారే పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు అని, వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి డబ్బులు కట్టారని ఆరోపించారు.

మోహన్ బాబు కంపెనీలో మేనేజర్ 56మందికి సంబంధించి రూ. 28వేలు మోహన్ బాబు ఎలా కడుతారని ప్రశ్నించారు. ఎన్నికలు జరుగుతున్న తీరుపై ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్‌లో కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నిక‌ల అధికారులు సూచించిన రూల్స్ ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 30 తారీఖులోపు మా ఎన్నిక‌ల్లో ఓటు వేయాల‌నుకుంటున్న సీనియ‌ర్ సిటిజ‌న్స్ ఓ లెట‌ర్ రాయాలి.

అందులో వాళ్లే అడ్ర‌స్‌, మెంబ‌ర్ షిప్ నెంబ‌ర్‌ను కూడా రాయాలి. వాళ్ల అసిస్టెంట్‌ను ఒక‌రినే పంపాలి. మ‌రొక‌రి ద్వారా ఈ పోస్ట‌ల్ బ్యాలెట్ ఓటును పంప‌కూడ‌దు. వ‌చ్చిన లెట‌ర్స్‌ను చూసుకుని అక్టోబ‌ర్ 4న ఆయా అడ్ర‌స్‌ల‌కు సీల్డ్ క‌వ‌ర్స్‌లో పోస్ట‌ల్ బ్యాలెట్ పంపుతామ‌ని, ఓటు వేసిన పోస్ట‌ల్ బ్యాలెట్ సీల్డ్ క‌వ‌ర్‌ను తీసుకుని 9వ తారీఖు లోపు రావాలని అధికారులు సూచించారు.

వాళ్లు మ‌నుషుల్ని పంపించుకుని లెట‌ర్స్ పంపిస్తారు. వాళ్లే డ‌బ్బులు క‌డ‌తారు. రేపు పోస్ట‌ల్ బ్యాలెట్ పంపిన త‌ర్వాత వాళ్లే వెళ్లి వాళ్ల‌కు కావాల్సిన‌ట్లు గుద్దించుకుని మ‌ళ్లీ పోస్ట్ చేయ‌ర‌ని ఏంటి గ్యారెంటి. ఇలా అస‌హ్యంగా ఎన్నిక‌లు జ‌రుపుతామా? (క‌న్నీళ్లు పెట్టుకుంటూ.. ), క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మ‌న్ కృష్ణంరాజుగారిని అడుగుతున్నాను. మీరు క‌ట్టాల్సిన రూ.500 కూడా ఈ లిస్టులో ఉంది. మ‌హేశ్ బాబుగారి తండ్రి డ‌బ్బు కూడా వాళ్లే క‌ట్టారు.

వైజాగ్‌లో ఉన్న‌వాళ్ల డ‌బ్బులు కూడా క‌ట్టారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డబ్బులు కూడా క‌ట్టారు. ల‌క్ష్మి, శార‌ద‌గారి డ‌బ్బులు క‌ట్టారు. ఇలా దిగ‌జారి ఎన్నిక‌లు జ‌రుపుతారా? ఇలా గుద్దించుకుని వ‌స్తారా? ఈ ఓట్ల‌ను క్యాన్సిల్ చేయాల‌ని ఎన్నిక‌ల ఆఫీస‌ర్‌ను కోరుతున్నాం. గెలిచే ముందు గుద్దించుకోవాలా? వాళ్లు క‌డితే, వీళ్లెలా తీసుకుంటార‌ని అడుగుతున్నాను.

శ‌ర‌త్‌బాబుగారికి ఫోన్ చేస్తే ఆయ‌న ఐదు వంద‌ల రూపాయ‌ల‌ను మోహ‌న్‌బాబుగారికి గూగుల్ పే చేస్తాన‌ని అన్నారు. ఇది ఎన్నిక‌లు జ‌రిగే ప‌ద్ధ‌తేనా? పెద్ద‌లైన ముర‌ళీమోహ‌న్‌గారు, చిరంజీవిగారు, నాగార్జున‌గారిని అడుగుతున్నాను. మీరు ఇప్ప‌డు స‌మాధానం చెప్పండి. 60 ఏళ్ల వాళ్లను కూడా ఇలా వాడుకుంటారా’’ అని ప్ర‌కాశ్ రాజ్ ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు.