మీ లాంటి భాష నాకు రాదు.. నాగబాబుకు ప్రకాష్ రాజ్ కౌంటర్

ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలు.. నాగబాబు ప్రకాష్ రాజ్‌పై చేసిన మాటల దాడి అందరికీ తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోభాగంగా జనసేన, పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరుపై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. పవన్ కళ్యాణ్‌ను ఊసరవెల్లి అంటూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృస్టించాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై నాగబాబు అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్లు వేశాడు.

Prakash raj Counter To Naga Babu Comments
Prakash raj Counter To Naga Babu Comments

నాగబాబు ఓ సుధీర్ఘమైన పోస్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్‌ను ఏకిపారేశాడు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ రాజకీయ సినీ జీవితం గురించి దారుణమైన కామెంట్స్ చేశాడు. సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలతో ఎలా ఆడుకున్నాడో.. పేమెంట్ల విషయంలో ఏం చేశాడో వంటి వాటిపై స్పందించాడు. ముందు నువ్ సరిగ్గా ఉండి మిగతా వారి గురించి మాట్లాడు అంటూ ప్రకాష్ రాజ్‌పై దారుణమైన కామెంట్స్ చేశాడు. ఇక నేటి ఉదయం నుంచి నాగబాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా నాగబాబు కామెంట్లకు ప్రకాష్ రాజ్ రివర్స్ కౌంటర్ వేశాడు. గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు. అంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా నాగబాబు పరువుదీశాడు. మొత్తానికి ఇలా ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకునేలానే ఉంది.

Advertisement