Prakash Raj: బండ్ల గ‌ణేష్ వ్యాఖ్య‌ల‌కు ప్ర‌కాశ్ రాజ్ అదిరిపోయే కౌంట‌ర్‌

Prakash Raj: అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న మా ఎన్నిక‌లు హీటెక్కిపోతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుంచి రోజుకో ట్విస్ట్‌ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు ప్ర‌కాశ్ రాజ్‌కి స‌పోర్ట్‌గా ఉన్న బండ్ల గ‌ణేష్ యూ ట‌ర్న్ తీసుకొని ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు చేశాడు.

Prakash Raj Counter to Bandla Ganesh Comments
Prakash Raj Counter to Bandla Ganesh Comments

ప్రకాశ్‌ రాజ్‌ శనివారం ప్యానల్‌ సభ్యులతో సమావేశయ్యారు. ఇక ఆదివారం ‘మా’ సభ్యులందరిని విందుకు ఆహ్వానిస్తూ ఇన్విటేషన్‌ పంపారు. దీంతో బండ్ల గణేశ్‌ సోషల్‌ మీడియా వేదిక స్పందిస్తూ ట్వీటర్‌లో ఓ వీడియో వదిలాడు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ రాజ్ ‘మా’ సభ్యులను విందుకు ఆహ్వానించడంపై బండ్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘దయచేసి ‘మా’ కళాకారులనువిందులు, సన్మానాల పేర్లతో వారందరిని ఒక దగ్గరకు చేర్చొద్దు.. ఎందుకంటే గత రెండేళ్లలో అందరు కరోనా భయంతో బ్రతుకుతున్నారు.. చాటా మంది చావు దాకా వెళ్లొచ్చారు.


మీరు ఏం చేస్తున్నారో ఫోన్ ద్వారా చెప్పండి. కళాకారుల ప్రాణాలతో చెలగాటమడోద్దని నా మనవి’ అని పేర్కొన్నాడు. బండ్ల గ‌ణేష్ మాట‌ల‌కు ప్ర‌కాశ్ రాజ్ త‌న‌దైన శైలిలో స్పందించారు. బండ్ల గణేష్ యూూటర్న్ తీసుకున్నారు. ఆయనకు ట్రాఫిక్ కష్టం వచ్చినట్టుంది. ఏం చేస్తాం. అందరినీ మెప్పించలేం కదా.. అందుకే బండ్ల హర్ట్ అయ్యారనుకుంటా.. ఆయన ఇష్టం. ఆయనకు సమాజం మీద ప్రేమ ఎక్కువగా ఉన్నట్లుంది. బండ్ల గణేష్ ప్రవర్తన అందరికి తెలిసిందే. గతంలో ఆయన అటెండ్ అయిన మీటింగ్స్‏ల గురించి మాట్లాడితే బాగుండేది.


ఎన్నికలన్నాక ప్రచారం చేసుకుంటాం. అందులో తప్పేముంది. అసోసియేషన్ ఎలక్షన్స్ డిస్కస్ చేయడం, అందరితో మాట్లాడడం, క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులను విందుకు పిలిచాము. ఈరోజు చిన్న ఆర్టీస్టులు కూడా మాట్లాడారు. మేమంతా దాదాపు నాలుగు గంటలు చర్చించుకున్నాము. ఇప్పటివరకు జరిగినవి.. జరగాల్సిన వాటి గురించి అందరితో మాట్లాడము. ఆయన మాటలకు నేను షాకయ్యాను. ఈనెల 19న నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత మ్యానిఫెస్టో ప్రకటిస్తామన్నారు ప్రకాష్ రాజ్..