Upasana Konidela : ఉపాసన బిడ్డకు ఉయ్యాల రెడీ.. తయారు చేసింది ఎవరో తెలసా..?
NQ Staff - June 18, 2023 / 02:49 PM IST

Upasana Konidela : మెగా కోడలు ఉపాసనకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. పెళ్లి అయిన పదేండ్లకు ఆమె తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. అందుకే చాలా విషయాలను ఆమె తనలాంటి ప్రెగ్నెన్సీ లేడీస్ కు తెలియజేస్తోంది. తాజాగా ఆమె ఓ పోస్టు చేసింది.
ఇందులో ఆమె తనకు పుట్టబోయే బిడ్డకు ఉయ్యాల గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలియజేసింది. అయితే ఈ ఉయ్యాలను ఇచ్చింది ప్రజ్వల ఫౌండేషన్. ఇది ఒక Oka sex trafficking organisation అని తెలుస్తోంది. హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి బయట పడిన యువతులు ఈ ఫౌండేషన్ లో ఉంటున్నారు.
ఆ యువతులు ఈ ఉయ్యాలను రెడీ చేసి ఉపాసనకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా చెప్పుకొచ్చింది. మొదటి నుంచి మెగా కోడలు అందరికంటే చాలా స్పెషల్. సెక్స్ బాధిత యువతులను, ట్రాన్స్ జెండర్లను ఆమె స్పెషల్ గా చూస్తారు. వారి పట్ల సమాజానికి ఉన్న అపోహను పోగొట్టడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు.

Prajwala Foundation Gifted Cradle To Upasana Konidela
తన బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒక ట్రాన్స్ జెండర్ అని గతంలో ఉపాసన తెలియజేసింది. ఇప్పటికే అనేక సార్లు సోషల్ ఇష్యూస్ పై ఆమె రియాక్ట్ అవుతూనే ఉంది. ఇప్పటికే చాలామంది అమ్మాయిలకు ఆమె హెల్ప్ చేసింది. అందుకే ఆమె గొప్ప మనసుకు బహుమతిగా ఈ ఉయ్యాలను ఇచ్చారు. ఈ గిఫ్ట్ తనకు చాలా స్పెషల్ అంటూ తెలిపింది ఉపాసన.