Akhanda : అఖండ లొకేష‌న్‌లో ప్ర‌గ్యా జైస్వాల్‌.. క్యూట్ లుక్స్ షేర్ చేసిన కంచె బ్యూటీ

Akhanda : అందం, అభినయం ఉండి కూడా స్టార్ గా ఎదగలేకపోయారు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ పూణే భామ పరిశ్రమకు వచ్చి అర్ధ దశాబ్దం దాటిపోయింది. అయినా సరైన బ్రేక్ రాలేదు. సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తూ మంచి ఆఫర్స్ కోసం ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తుంది.

Pragya Jaiswal on location photo stills
Pragya Jaiswal on location photo stills

తాజాగా బాల‌కృష్ణ సినిమాలో ఆఫ‌ర్ కొట్టేసింది. అఖండ సినిమాలో బాల‌య్య‌తో జోడి క‌ట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా లొకేష‌న్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో ప్ర‌గ్యా క్యూట్ అండ్ స్వీట్‌గా క‌నిపించి మైమ‌ర‌పించింది. ఇందులో ప్ర‌గ్యా క్యూట్ లుక్స్ కి థ్రిల్ అవుతున్నారు అభిమానులు.

Pragya Jaiswal on location photo stills
Pragya Jaiswal on location photo stills

2014లో విడుదలైన బైలింగ్వల్ మూవీ డేగ ప్రగ్యా జైస్వాల్ మొదటి చిత్రం. తమిళంలో విరాట్టుగా విడుదలైంది. ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసిన ఆమెకు విజయం దక్కలేదు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ హీరో వరుణ్ తేజ్ తో చేసిన కంచె చిత్రానికి ప్రగ్యా జైస్వాల్ ని తీసుకోవడం జరిగింది.

పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యా అందుకున్న మొదటి హిట్. ఈ సినిమా తరువాత ఆమెకు ఆఫర్స్ వరుస కడతాయని ప్రేక్షకులు భావించారు. అయితే హిట్ కొట్టినా ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, ధరమ్ సరనస చేసిన నక్షత్ర భారీ ప్లాప్స్ గా నిలిచాయి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆమెను కూడా ఫేమ్ తేలేకపోయింది. దీనితో ప్రగ్యా డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. ఎన్నో ఆశలతో మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర మూవీ చేశారు. ప్రగ్యా కెరీర్ లో అదొక డిజాస్టర్ గా నిలిచింది. ప్రగ్యా కెరీర్ అయోమయంలో పడగా… అఖండ మూవీలో ఛాన్స్ దక్కించుకొని… షాక్ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అయితే అమ్మ‌డికి మ‌రిన్ని ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయం.