Pragya Jaiswal : ప్ర‌గ్యా జైస్వాల్ క‌ళ్లు చెదిరే వ‌ర్కవుట్స్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Pragya Jaiswal : ప్ర‌గ్యా జైస్వాల్ రిస్కీ వ‌ర్క‌వుట్స్‌తో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. చెమ‌టలు ప‌ట్టేలా ఈ అమ్మ‌డు చేస్తున్న వ‌ర్క‌వుట్స్ చూస్తూ అంద‌రు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.ఈ అమ్మ‌డు ఇంత స్లిమ్‌గా, అందంగా ఉండ‌డానికి కార‌ణం వర్క‌వుట్స్ అని అంటున్నారు. ప్ర‌స్త‌తం ప్ర‌గ్యాకి సంబంధించిన వ‌ర్క‌వుట్ వీడియో వైర‌ల్‌గా మారింది.

Pragya Jaiswal H0TTEST Workout Visuals
Pragya Jaiswal H0TTEST Workout Visuals

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు.

ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ బాలయ్య అఖండలో హీరోయిన్‌గా నటిస్తోంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌తో పాటు ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఎన్నో అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్‌ క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘జయ జానకీ నాయకా’ సినిమాలో నటించిన ప్రగ్యా ఇప్పుడు మరోసారి ఆయన దర్శక్వంలో అఖండ సినిమాలో నటిస్తుంది. బాలయ్యకు జోడీగా తొలిసారి నటించిన ప్రగ్యాకు సోషల్‌ మీడియాలో బాగానే ఫాలోయింగ్‌ ఉంది.

ఈ అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంటుంది. క్యూట్ పిక్స్‌తో కేక పెట్టిస్తూ అంద‌రి మ‌న‌సులు దోచుకుంటూ ఉంటుంది. ప్ర‌స్తుతం ప్ర‌గ్యా క్యూట్ పిక్స్ కొన్ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.