Pragya jaiswal: ప్ర‌గ్యా బ‌ర్త్ డే.. త‌ళుక్కున మెరిసిన ర‌కుల్ ప్రీత్ సింగ్

Pragya jaiswal: టాలీవుడ్‌లో త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తున్న అందాల ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్. 1991లో జనవరి 12న పూణేలో జ‌న్మించిన ప్రగ్యా జన్మించిన రీసెంట్‌గా 31వ బ‌ర్త్ డే జ‌రుపుకుంది. ఇటీవల అఖండ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ బోల్డ్ భామ కెరీర్ పై అనేక ఆశలతో ఉన్నారు. 2014లో విడుదలైన బైలింగ్వల్ మూవీ డేగ ప్రగ్యా జైస్వాల్ మొదటి చిత్రం. తమిళంలో విరాట్టుగా విడుదలైంది. ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేసిన ఆమెకు విజయం దక్కలేదు.

Pragya jaiswal birthday pics
Pragya jaiswal birthday pics

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ హీరో వరుణ్ తేజ్ తో చేసిన కంచె చిత్రానికి ప్రగ్యా జైస్వాల్ ని తీసుకోవడం జరిగింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యా అందుకున్న మొదటి హిట్. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌గ్యాకి మ‌ళ్లీ అలాంటి విజ‌యం దక్క‌లేదు.

Pragya jaiswal birthday pics
Pragya jaiswal birthday pics

బాలయ్య నటించిన `అఖండ` చిత్రంతో బంపర్‌ హిట్‌ అందుకున్న ప్రగ్యా జైశ్వాల్‌ ఇప్పుడు తన బర్త్ డే సెలబ్రేషన్‌లో మునిగి తేలుతుంది.

Pragya jaiswal birthday pics
Pragya jaiswal birthday pics

తాజాగా ప్రగ్యా తన బర్త్ డే ఫోటోలను పంచుకోగా, అందులో రకుల్‌ హల్‌చల్‌ చేయడం విశేషం. ముంబయిలో ఉంటున్న ఆమె అక్కడే తన బర్త్‌ డే జరుపుకుంది. అతికొద్ది మంది ఫ్రెండ్స్ తో కలిసి తన బర్త్ డేని నిర్వహించుకుంది ప్రగ్యా.

Pragya jaiswal birthday pics
Pragya jaiswal birthday pics

ఇందులో తన ఫ్రెండ్స్ తోపాటు రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడా ఉండటం విశేషం. వీరిద్దరు చాలా కాలంగా మంచి స్నేహితులు. తెలుగులో రాణిస్తున్న క్రమంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం చిగురించింది.

Pragya jaiswal birthday pics
Pragya jaiswal birthday pics

ఆ స్నేహాన్ని చాటుకున్నారు. అయితే ప్రగ్యా బర్త్ డే పార్టీలో మాత్రం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రగ్యా పంచుకున్న ఫోటోలు చూస్తుంటే వీరి ఏ రేంజ్‌లో ఎంజాయ్‌ చేశారో, పార్టీలో రచ్చ చేశారో అర్థమవుతుంది. మొత్తంగా ఫ్రెండ్స్ తో కలిసి తెగ ఎంజాయ్‌ చేసినట్టు తెలుస్తుంది.

Pragya jaiswal birthday pics
Pragya jaiswal birthday pics

ఇక ప్రగ్యా పని అయిపోయిందని అంతా ఫిక్స్ అయిన సమయంలో ఊహించిన విధంగా బాలయ్య సినిమాలో ఆఫర్‌ వచ్చింది. `అఖండ`లో ఆమె హీరోయిన్‌గా ఆకట్టుకుంది. సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ప్రగ్యాకి పెద్ద బూస్ట్ దొరికినట్టయ్యింది. దీంతో ఇప్పుడు మేకర్స్ ప్రగ్యా కోసం వెంటపడుతున్నారని టాక్‌.