Pragya: లో దుస్తుల‌తో పిచ్చెక్కిస్తున్న అఖండ బ్యూటీ.. అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!

Pragya: 2015లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంచె’ చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్‌. ఈ సినిమాలో తన అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుందీ బ్యూటీ. అనంతరం పలు వరుస అవకాశాలను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.

pragya hot look
pragya hot look

తాజాగా బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ‘అఖండ’ మూవీతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైందీ బ్యూటీ. ఇదిలా ఉంటే ప్రగ్యా ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒకసారి కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్రగ్యాకు రెండో సారి కరోనా సోకింది. ఈ విషయాన్ని ప్రగ్యా సోషల్‌ మీడియా వేదికగా స్వయంగా తెలిపింది.

కొద్ది రోజుల క్రితం ఈ అందాల తార కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది .తెల్లని పొట్టి గౌనులో, చిరు నవ్వులు చిందిస్తోన్న సమయంలో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘నెగిటివ్‌.. ఈ పదం ఇంతకుముందెప్పుడూ నాకు ఇలా సంతోషాన్ని ఇవ్వలేదు’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టింది.

ఇక సోషల్‌మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫోటోషూట్‌లు నిర్వహిస్తే.. తన అందచందాలతో ఫ్యాన్స్‌ని కట్టిపడేస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రగ్యా అందాల ఆరబోత కాస్త పెంచేసింది కూడా. దీంతో కుర్రాళ్లంతా ఆమె ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.

pragya hot look1
pragya hot look1

తాజాగా ప్ర‌గ్యా లో దుస్తుల‌లో అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. ఈ అమ్మ‌డి అంద‌చందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధుల‌వుతున్నారు. ప్ర‌గ్యా అందం చూసి మైమ‌ర‌చిపోతున్నారు.