PRAGATHI: ప్ర‌గ‌తిని ప్ర‌శ్నించిన నెటిజ‌న్స్.. అస‌లు గుట్టు విప్పిన సీనియ‌ర్ న‌టి

సినిమా, సీరియ‌ల్ ఆఫ‌ర్స్ త‌గ్గిన వారికి సోష‌ల్ మీడియా మంచి ప్లాట్‌ఫాంగా మారింది. ఇందులో త‌మ అంద‌చందాలు ఆర‌బోస్తూ నెటిజ‌న్స్ దృష్టిని ఆకర్షిస్తూ ఫుల్ పాపుల‌ర్ అవుతున్నారు. కుర్ర భామ‌లే కాదు సీనియ‌ర్ న‌టీమ‌ణులు కూడా ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. త‌ల్లి, అత్త, వ‌దిన‌, మోడ్ర‌న్ మ‌ద‌ర్స్‌గా ఉండే వారు కూడా వ‌ర్కవుట్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ అంద‌రిని అల‌రిస్తున్నారు. ఇక్క‌డితే ఆగితే బాగుండేది కాని సీనియ‌ర్ న‌టీమ‌ణులు పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేయ‌డం వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ర‌చ్చ చేయడం చూస్తుంటే దేశం ఎటు వెళుతుందో అర్దం కావ‌డం లేదు.


క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి తెలుగుతో పాటు తమిళ ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. గ‌త ఏడాది నుండి ఈవిడ సోష‌ల్ మీడియాపై చాలా ఫోక‌స్ పెట్టింది. స్లిమ్‌గా మారేందుకు తెగ వ‌ర్క‌వుట్స్ చేస్తుండ‌గా, వాటికి సంబంధించిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అంతేకాదు అడ‌పాద‌డ‌పా హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ అల‌రిస్తుంది. నాలుగు పదులు వయసులోనూ వర్కవుట్లు చేసే తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. ఎంతో మంది మహిళల్లో ప్రగతి స్ఫూర్తిని నింపుతున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది తమ ఆరోగ్యం, ఫిట్ నెస్ మీద దృష్టి పెడుతున్నారు. తాజాగా ప్రగతి లైవ్‌లోకి వచ్చి అభిమానుల‌తో ముచ్చ‌టించింది.

నెటిజ‌న్స్ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సమాధానం ఇచ్చిన ప్ర‌గ‌తిని ఓ నెటిజ‌న్ ఇంత‌లా వ‌ర్కవుట్ చేయ‌డానికి ఇన్సిపిరేష‌న్ ఎవ‌రు అని అడిగిరాఉ. దీనికి స్పందించిన ప్ర‌గ‌తి ఎప్పటినుంచో ఫిట్‌గా ఉండాలనే కోరిక ఉండేది.. కానీ గత రెండేళ్ల నుంచి ఎక్కువగా వర్కవుట్లు చేస్తున్నా.. ఒక్కసారి రిజల్ట్ చూశాక మనకే ఇంకా చేయాలని అనిపిస్తుంది.. నా ఎనర్జీ, ఫిట్ నెస్ బాగా పెరిగిపోయింది.. అలా నాక్కూడా బాగా అనిపిస్తుండటంతో వర్కువుట్లు చేస్తున్నాను అని ప్రగతి అన్నారు. కొంత మంది మీరు అందంగా ఉన్నారు, చాలా ఫిట్‌గా ఉన్నారు అన‌డంతో ప్ర‌గ‌తి ఫుల్ ఖుష్ అయింది.