Pragathi: ప్ర‌గ‌తి ఊర‌మాస్ డ్యాన్స్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Pragathi: తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ పాపులర్ అయిన ప్రగతి.. నాలుగు పదుల వయసులోనూ ఎంతో స్ట్రాంగ్ అని నిరూపించుకుంటోంది. అంతేకాదు తన లేటెస్ట్ లుక్స్, డాన్స్ వీడియోలతో కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా చేస్తోంది.

TheNewsQube-
pragathi mass dance
pragathi mass dance

ఇప్పటికే పలు డాన్స్ వీడియోలు, హాట్ వర్కవుట్స్, తీన్మార్ స్టెప్పులతో పరేషాన్ చేసిన ప్రగతి.. మరోసారి తన పవర్ చూపించింది. తాజాగా ఇన్స్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసి,కుర్ర‌కారుకి పిచ్చెక్కించింది. ఇందులో ప్ర‌గ‌తి మాస్ స్టెప్స్‌కి కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు. ఈ వ‌య‌స్సులోను ఇంత ఎన‌ర్జీ ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రగతి టాలీవుడ్ లో సీనియర్ నటిగా కొనసాగుతున్నారు. 90 వ దశకం నుంచి ఆమె నటిగా రాణిస్తున్నారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తల్లి, అత్త తరహా పాత్రలకు దర్శకులు ప్రగతినే సంప్రదిస్తున్నారు.

సెంటిమెంట్ పండిస్తూనే కామెడీ టచ్ తో ఆకట్టుకునే నైపుణ్యం ప్ర‌గ‌తిలో ఉంది. ఎఫ్2 చిత్రంలో ప్రగతి కామెడీ టైమింగ్ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఎఫ్3 లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా ప్రగతి ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది.

ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన జిమ్ వర్కౌట్ వీడియోలు, సరదాగా ఇంట్లో డాన్స్ చేస్తున్న వీడియోలు, గ్లామర్ ఫొటోస్ ని ప్రగతి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ప్రగతి ఫిట్ నెస్ విషయంలో చాలా కేరింగ్ గా ఉంది. డాన్స్ చేసే సమయంలో ఆమె ఎనెర్జీ లెవల్స్ కుర్రాళ్లతో సమానంగా ఉంటున్నాయి. దీనితో ప్రగతి జోష్ చూస్తీ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

OORA MASS🔥: Actress Pragathi MASS Dance Steps | Pragthi Latest Video | Daily Culture – YouTube