Pragathi: ప్ర‌గ‌తి ఫ‌న్నీ వ‌ర్క‌వుట్స్… నీలో చాలా ఉందంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Pragathi: హీరోయిన్సేనా, మేం ఏమి త‌క్కువ తిన‌లేదంటూ కొందరు సీనియ‌ర్ ఆర్టిస్టులు ర‌చ్చ చేస్తున్నారు. ఇందులో ప్ర‌గ‌తి ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. ప్రగతి టాలీవుడ్‌లో మదర్‌ రోల్స్‌తో గుర్తింపు పొందింది. అయితే సినిమాల కంటే సోషల్‌ మీడియాలోనే ఆమెకు ఫాలోయింగ్‌ ఎక్కువ. వర్కవుట్‌ వీడియోలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈమె డ్యాన్స్ వీడియోల‌తోను ర‌చ్చ చేస్తూ ఉంటుంది.

pragathi funny workout
pragathi funny workout

దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయగల ప్రగతి నటన, చాలా సహజంగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా మదర్ పాత్రలకు ఆమె, దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నారు.

ప్రగతి సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే మాత్రం అసలు ఆమె ఈమేనా అని భావన కలుగుతుంది. వెండితెరపై అంబాసిడర్ కార్ లా కనిపించే ప్రగతి, ఇంస్టాగ్రామ్ వీడియోలలో బెంజ్ కారు రేంజ్ ఫోజులిస్తారు. ఈమె ఫిట్నెస్ ఫ్రీక్ అవతారం ఎత్తింది. జిమ్ సూట్ ధరించి కఠిన కసరత్తులు చేస్తూ ఉంటారు. సదరు వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. అసలు ప్రగతి ఎనెర్జీ చూస్తే, యంగ్ ఫెలోస్ కూడా ఈర్ష్య పడాల్సిందే. ఆ రేంజ్ లో ఆమె వర్కవుట్స్ ఉంటాయి.

తాజాగా ఈ అమ్మ‌డు జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ క్యూట్ లుక్ లో మెరిసింది. ప్ర‌గ‌తి ఫన్నీ వ‌ర్క‌వుట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ప్రగతి వీడియోలను నెటిజెన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ వయసులో మీకు ఇవ్వన్నీ అవసరమా? హీరోయిన్ అవుదామనుకుంటున్నావా? అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సదరు నెగిటివ్ కామెంట్స్ పై ప్రగతి స్పందిస్తారు కూడా.

ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే అన్నట్లు 44 ఏళ్ల వయసులోనూ అమ్మాయిలకు గట్టిపోటి ఇస్తున్నట్లుంటుంది పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఫిజిక్. ఇప్పటిరకు ప్రగతి చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో తెలిసిందే.

Actress Pragathi Funny Gym Workout Video | Actress Pragathi Latest Workout Video | Daily Culture – YouTube