PRADEEP: తండ్రి మ‌ర‌ణంతో కుమిలిపోతున్న ప్ర‌దీప్.. సోష‌ల్ మీడియాలో త‌న బాధ‌ను షేర్ చేసుకున్న యాంకర్

బుల్లితెర‌పై త‌న మాట‌ల తూటాల‌తో ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని పంచుతూ వ‌స్తున్నారు యాంక‌ర్ ప్ర‌దీప్. క‌రోనా స‌మ‌యంలోను నిరంతరం షూటింగ్స్‌లో పాల్గొంటున్న నేప‌థ్యంలో ప్ర‌దీప్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఇత‌ని నుండి ఆయ‌న తండ్రికి క‌రోనా సోకిన‌ట్టు తెలుస్తుంది. క‌రోనాతో కొద్ది రోజులు చికిత్స పొందిన ప్ర‌దీప్ తండ్రి ఆరోగ్యం విష‌మించి క‌న్నుమూసారు. ఆయ‌న తండ్రి మ‌ర‌ణం ప్ర‌దీప్‌ని చాలా క్షోభ‌కు గురి చేసింది. ఇక లేర‌ని తెలిసి ప్ర‌దీప్ చాలా ఆవేద‌న చెందుతున్నాడు. తొలి సారి త‌న తండ్రి మృతిపై స్పందించిన ప్ర‌దీప్ భావోద్వేగానికి గుర‌య్యాడు.

ఆదివారం ప్రదీప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు షేర్ చేస్తూ త‌న తండ్రి మృతిపై చాలా ఆవ‌దేన‌కు గుర‌య్యాడు . ‘ఐ లవ్ యు నాన్న, ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైన చిరునవ్వుతో ఎలా ఎదుర్కొవాలో నేర్పించారు. నేను ఏం చేసినా మీకు గౌరవం కలిగించే పని చేస్తాను’ అంటు రాసుకొచ్చాడు. అలాగే ‘నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మంచి చెడు అనేది ఆలోచించకుండా మీరు నా వెంట ఉన్నారు. బాధతో ముక్కలైన నా మనస్సును మీ ప్రేమతో బాగు చేసేవారు. మీ ధైర్యం నాకు ఎన్నో సార్లు స్ఫూర్తినిచ్చింది. అలాగే నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేసింది.

మీరు మించిన ప్రేమ లేదు. మీరు నాకు ఎప్పటికీ స్పెషల్. జీవితంలో నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ఆపలేను. మీరు కోరుకున్నట్లుగానే ఎప్పుడూ నా చూట్టు ఉన్నవారిని, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ నవ్విస్తూనే ఉంటా. ఇక మనం కలిసే దాకా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటా నాన్న.. ఐ మిస్‌ యూ’ అంటూ ప్రదీప్‌ తన ఏమోషనల్‌ పోస్టుతో అందరిని కదిలించాడు. ప్ర‌దీప్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యాక ఎక్క‌డ కూడా ఈ విష‌యం ప్ర‌క‌టించ‌లేదు. అలానే త‌న తండ్రి మృతిపై కూడా ఎక్క‌డ స్పందించ‌లేదు. తొలిసారి సోష‌ల్ మీడియాలో చాలా ఫీల‌వుతూ పోస్ట్ పెట్టాడు.