PRADEEP: బుల్లితెర‌ పై క‌రోనా ప్ర‌తాపం.. యాంక‌ర్ ప్ర‌దీప్‌కు క‌రోనా పాజిటివ్‌..!

PRADEEP క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గింది, ఇంక ప్ర‌శాంతంగా జీవ‌నం సాగించొచ్చు అని అంద‌రు రిలాక్స్ అయిప స‌మ‌యంలో మ‌ళ్లీ ఈ మ‌హ‌మ్మారి త‌న ప్ర‌తాపం చూపిస్తుంది. గ‌త మూడు నెల‌లుగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి రోజు 5 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతుండ‌గా, దేశంలో మూడు ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు వ‌స్తున్నాయి. మ‌ర‌ణాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ క‌రోనా ఎఫెక్ట్ ఒక్క సామాన్యుల‌పైనే కాదు సెల‌బ్రిటీల‌పైన ఉంది. గ‌త ఏడాది కొంత జాగ్ర‌త్త‌గా ఉన్న ప్ర‌ముఖులు ఇప్పుడు పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయే సరికి వార‌కు క‌రోనా బారిన ప‌డుతున్నారు.

సినీ రంగం, టీవీ రంగంలోను క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తుంది. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు క‌రోనాతో ఐసోలేష‌న్‌తో చికిత్స పొందుతుండ‌గా, మ‌రి కొంద‌రు కోలుకున్నారు. తాజాగా న‌టుడు, యాంకర్ ప్ర‌దీప్ మాచిరాజుకు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయినట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ప్ర‌దీప్ ..ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ, జీ తెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహ‌రిస్తున్నాడు. తాజాగా డ్రామా జ్యూనియ‌ర్స్ సీజ‌న్ 5కు సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌దీప్ స్థానంలో యాంక‌ర్ ర‌వి ప్ర‌త్య‌క్షం అయ్యే స‌రికి అంద‌రు కంగుతిన్నారు.

ప్ర‌దీప్ క‌రోనా బారిన ప‌డిన కార‌ణంగానే ఆయ‌న స్థానంలో ర‌వి వ‌చ్చాడ‌ని పుకార్లు షికారు చేస్తున్నాయి. కొంద‌రు అభిమానులు ఆయ‌న‌కు క‌రోనా వ‌చ్చింద‌ని తెలిసి సోష‌ల్ మీడియాలో త్వ‌ర‌గా కోలుకోవాలంటూ వ‌రుస ట్వీట్స్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు ప్ర‌దీప్‌కు కాల్ చేసి క్షేమ స‌మాచారాలు కూడా తెలుసుకుంటున్నారు. మ‌రి దీనిపై ప్ర‌దీప్ ఏమైన స్పందిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మ‌నోడు ఓ వైపు యాంకర్‌గా చేస్తూనే మ‌రో వైపు హీరోగాను మంచి సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవ‌ల 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది.

Advertisement