PRADEEP: క‌రోనాతో క‌న్నుమూసిన యాంక‌ర్ ప్ర‌దీప్ తండ్రి.. విషాదంలో కుటుంబం..!

ప్ర‌స్తుతం విజృంభిస్తున్న క‌రోనాకు సామాన్యుడు, సెల‌బ్రిటీ అనే తేడా లేకుండా పోయింది. కాస్త అనారోగ్యంతో ఉంటే చాలు వారిని క‌బ‌ళించేస్తుంది. ఇప్ప‌టికే ఎందరినో పొట్ట‌న పెట్టుకున్న క‌రోనా మ‌హమ్మారి తాజ‌గా యాంక‌ర్ ప్ర‌దీప్ తండ్రి పాండు రంగ‌ని కాటేసింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న పాండురంగ ఆరోగ్య ప‌రిస్థితి శ‌నివారం విష‌మించ‌డంతో సాయంత్రం స‌మ‌యంలో ఆయ‌న క‌న్నుమూసిన‌ట్టు తెలుస్తుంది. క‌రోనా వ‌ల‌న ఆయ‌న అంత్య‌క్రియ‌లకు కుటుంబ స‌భ్యుల‌ని పెద్ద‌గా అనుమ‌తించ‌డం లేద‌ని తెలుస్తుంది.

గ‌త కొద్ది రోజులుగా యాంకర్ ప్ర‌దీప్ ఏ షోల‌లో క‌నిపించ‌డం లేదు. ప్ర‌దీప్ స్థానంలో ర‌వి ప‌లు కార్య‌క్ర‌మాల‌ను హోస్ట్ చేస్తున్నాడు. క‌రోనా వ‌ల‌న ప్ర‌దీప్ షోస్‌కు హాజ‌రు కావ‌డం లేద‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే క‌రోనా ప్ర‌దీప్ నుండి ఆయ‌న తండ్రికి సోకి ఉంటుంద‌ని, దాని వ‌ల్ల‌నే పాండు రంగ మృతి చెందాడ‌ని స‌మాచారం. ప్ర‌దీప్ తండ్రి మృతి చెంద‌డంతో ఆయ‌న కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌దీప్‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.కాగా ఇన్నాళ్లు యాంక‌ర్‌గా అల‌రిస్తూ వ‌చ్చిన ప్ర‌దీప్ ఇటీవ‌ల 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా సినిమాతో హీరోగా వెండితెర ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement