Prabhu Deva : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన ప్రభుదేవా..?
NQ Staff - June 12, 2023 / 10:14 AM IST

Prabhu Deva : ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా గురించి అందరికీ బాగా తెలుసు. ఆయన డ్యాన్స్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కేవలం డ్యాన్స్ మాస్టర్ గానే కాకుండా నటుడిగా, డైరెక్టర్ గా ఇలా అన్ని విభాగాల్లో సత్తా చాటుతున్నారు ప్రభుదేవా. కెరీర్ పరంగా మంచి పొజీషన్ లో ఉన్న ఆయన వ్యక్తిగతంగా మాత్రం ఇబ్బందులు పడుతున్నాడు.
ఆయనకు గతంలో 2011లో రమాలతతో విడాకులు అయ్యాయి. అప్పటికే వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా.. పెద్ద కొడుకు క్యాన్సర్ తో మరణించాడు. ఆమెకు విడాకులు ఇచ్చి నయనతారతో డేటింగ్ చేశాడు. అప్పట్లో వీరి విడాకులకు నయనతారనే కారణం అని ప్రభుదేవా భార్య ఆరోపించింది. నయనతారతో బంధాన్ని కూడా వ్యతిరేకించింది.
దాంతో నయనతారను వదిలేశాడు ప్రభుదేవా. కొన్నాళ్ళు సింగిల్ గా ఉన్న ప్రభుదేవా 2020లో డాక్టర్ హిమానీ సింగ్ ని నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి హిమానీ సింగ్ పెద్దగా బయటకు రావట్లేదు. అయితే రీసెంట్ గా ప్రభుదేవా 50వ పుట్టిన రోజు వేడుకలను ముంబైలో గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ బర్త్ డే వేడుకల్లో మొదటిసారి హిమానీ సింగ్ కనిపించింది. అయితే రీసెంట్ గానే హిమానీ సింగ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందంట. ఈ విషయమే ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. యాభై ఏండ్ల వయసులో కూడా ప్రభుదేవా తండ్రి అవడం అంటే మాటలు కాదని అంటున్నారు ఆయన ఫ్యాన్స్.