Prabhas : ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్ లో పూజా కాకుండా ఇంకో అమ్మాయి ఉంది చూశారా?
Kondala Rao - February 16, 2021 / 06:25 PM IST

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీస్ కి సంబంధించి రోజూ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఆ హీరోకి, అతని సినిమాలకి అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు ఇలా ఇంట్రస్టింగ్ లీకేజ్ లు ఇస్తున్నారు. ప్రభాస్ పిక్చర్లు లేటుగా(ఏడాది, ఏడాదిన్నర గ్యాప్ తో) రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ని ఇలాగైనా కాస్త సంతృప్తిపరుస్తున్నారు. ఈ క్రమంలో రీసెంటుగా ఒక అనఫిషియల్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా మొన్న ప్రేమికుల రోజున ‘రాధే శ్యామ్’ అఫిషియల్ గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే.
ఎవరామె?..
రాధేశ్యామ్ లేటెస్ట్ టీజర్ లో ప్రభాస్, పూజాహెగ్డేతోపాటు మరో అమ్మాయిని కూడా ప్రత్యేకంగా చూపించారు. దీంతో ఇప్పుడు అందరూ ఆ నల్లకలువ ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఆ భామని ఊరికే అలా ఫోకస్ చేశారా లేక ఆమెకి కూడా సినిమాలో ఏదైనా క్యారక్టర్ ఇచ్చారా అని ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం దొరకలేదు. హీరో గారు ‘‘నా దేవతా’’ అంటూ అంతమందిలో గెంతుతూ గొంతెత్తి పిలుస్తాడు. దీంతో డైరెక్టుగా హీరోయిన్ నే చూపిస్తే థ్రిల్లేముంటుంది అనుకొని మొదట ఇలాంటి డీగ్లామరస్ అమ్మాయిని క్లోజప్ లో కావాలనే హైలైట్ చేశారా అని కూడా సినీ అనలిస్టులు భావిస్తున్నారు.

Prabhas : who is that girl in prabhas radheshyam movie
‘సాహో’ కన్నా: Prabhas
‘రాధ్యేశ్యామ్’ మూవీ థియేటర్లలోకి రాకముందే ప్రభాస్ ‘సలార్’ షూటింగ్ పట్టాలెక్కింది. అలాగే ఈ ‘రాధేశ్యామ్’ని కూడా ‘సాహో’ రిలీజ్ కన్నా ముందే చిత్రీకరణ ప్రారంభించారు. కానీ, కరోనా కారణంగా భారీ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించి ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు ఎండింగ్ పెట్టేశారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్లపై తెరకెక్కించిన ‘రాధేశ్యామ్’కి జిల్ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్ చేయగా ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ఫ్రెష్ లుక్ కేక పుట్టిస్తోందంటున్న ‘రాధేశ్యామ్’ పాటలు, సినిమా ఎలా అలరిస్తాయో చూడాలి.