Prabhas : ప్రభాస్‌కు తీవ్ర అనారోగ్యం.. షూటింగ్స్ క్యాన్సిల్‌ చేసి విదేశాలకు

NQ Staff - March 9, 2023 / 10:00 PM IST

Prabhas : ప్రభాస్‌కు తీవ్ర అనారోగ్యం.. షూటింగ్స్ క్యాన్సిల్‌ చేసి విదేశాలకు

Prabhas : ప్రభాస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడంటూ గత నెలలోనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షెడ్యూల్ ప్రభాస్ అనారోగ్య కారణాల వల్ల వాయిదా పడిందని కూడా ప్రచారం జరిగింది.

ఆ విషయం పై ఎలాంటి అధికారిక స్పష్టత రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు వాటిని పుకార్లే అనుకున్నారు. కానీ తాజాగా ప్రభాస్ అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం విదేశాలకు వెళ్లబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

అంతే కాకుండా రాబోయే రెండు నెలలకు సంబంధించిన షెడ్యూల్స్ అన్నింటిని కూడా క్యాన్సల్ చేయాలని చిత్ర యూనిట్ సభ్యులకు ప్రభాస్ టీం చెప్పిందట. దాంతో ఇప్పటికే విడుదల తేదీలు ఖరారైన సినిమాలన్నింటి తేదీలు మళ్లీ మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

ప్రభాస్ కనీసం రెండు నెలల పాటు విదేశాల్లో పూర్తి విశ్రాంతిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రభాస్ అనారోగ్య సమస్యలు అభిమానులను ఆందోళన గురి చేస్తున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us