Prabhas : ప్రబాస్‌కి చెల్లెళ్లంటే ఎంత ప్రేమో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.!

NQ Staff - September 23, 2022 / 07:49 AM IST

160202Prabhas : ప్రబాస్‌కి చెల్లెళ్లంటే ఎంత ప్రేమో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.!

Prabhas : యూనివర్సల్ స్టార్‌గా తన కెరీర్‌ని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు ప్రబాస్. సినిమా కోసం ఎంతటి కష్టాన్నయినా భరించేస్తాడు ప్రబాస్. అంత కమిట్మెంట్ వున్నోడు కనకే, ఆ స్థాయిలో స్టార్‌డమ్ దక్కించుకున్నాడు ప్రబాస్.కేవలం ప్రొపిషనల్ లైఫ్‌లోనే కాదు, పర్సనల్ లైఫ్‌లోనూ ప్రబాస్ అంతే బాధ్యతగా వుంటాడు. ముఖ్యంగా తన చెల్లెల్లంటే ప్రబాస్‌కి పిచ్చి ప్రేమ. షూటింగులతో ఎంత బిజీగా వున్నా, కుటుంబానికి ముఖ్యంగా తన ముగ్గురు చెల్లెళ్ల కోసం టైమ్ కేటాయిస్తుంటాడు ప్రబాస్.

Prabhas very responsible for his Sisters

Prabhas very responsible for his Sisters

చెల్లెళ్లకు గాడ్స్ గిఫ్ట్ ప్రబాస్ అందుకే ప్రబాస్ ఫ్యాన్స్‌కే కాదు, తన చెల్లెళ్లకు కూడా డార్లింగే. ముఖ్యంగా ప్రబాస్ పెద్ద చెల్లెలు ప్రణీత, ప్రబాస్ గురించి అప్పుడెప్పుడో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు చెల్లెళ్లపై ప్రబాస్‌కి ఇంత బాధ్యతతో కూడిన ప్రేమా.? అని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. నిర్మాతగా రాణించాలనుకున్న ప్రణీతకు అమెరికాలో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ప్రొడక్షన్ కోర్స్ చేసేందుకు అన్ని రకాలా సహాయ సహాకారాలు అందించారట. అలాగే తాను నిర్మించిన సినిమాలను ఎంకరేజ్ చేస్తూ, తన వంతుగా సూచలూ, సలహాలూ ఇస్తుంటాడట ప్రబాస్. తన లైఫ్‌లో అన్న ప్రబాస్ తనకు మర్చిపోలేని బహుమతి అంటోంది ప్రణీత.

ఇటీవలే కృష్టంరాజు మరణించడంతో చెల్లెళ్లకు సంబంధించిన అన్ని రకాల బాధ్యతలు ఇప్పుడు మరింత రెట్టింపయ్యాయి. ముగ్గురు చెల్లెళ్లకు సంబంధించిన చదువు, కెరీర్.. ఆయా బాధ్యతలతో పాటూ, వారి పెళ్లిళ్ల బాద్యత కూడా ఇప్పుడు ప్రబాస్‌దే. ఓ పక్క తన కెరీర్ చూసుకుంటూనే కుటుంబ బాధ్యతను మొత్తం తన భుజాలపై మోయాల్సి వుంది ప్రబాస్.