Prabhas: ప్ర‌భాస్ చాలా కాస్ట్‌లీ గురూ.. ఆయ‌న సినిమాకు రూ.12 కోట్ల లెన్స్

Prabhas: బాహుబ‌లికి ముందు ప్ర‌భాస్ క్రేజ్ కేవ‌లం సౌత్ ప‌రిశ్ర‌మ‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మై ఉండేది. ఎప్పుడైతే బాహుబ‌లి చిత్రం రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కి పెద్ద విజ‌యం సాధించిందో ఇక అప్ప‌టి నుండి ప్ర‌భాస్‌ని అందుకోవడం ఎవరి త‌రం కావ‌డం లేదు. ఆయ‌న చేసే ప్ర‌తి సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుండ‌గా, సినిమాల కోసం వాడే కాస్ట్యూమ్స్, సెట్స్, లెన్స్ ఇలా ప్ర‌తీది రిచ్‌గానే ఉంటుంది. కథ కాస్టింగ్ నుండి మొదలుకుని టెక్నీషియన్స్.. వాడే టెక్నాలజీ ఇలా అన్ని కూడా అత్యంత రిచ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు ప్ర‌భాస్.

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన సాహో తెలుగు ప్రేక్షకుల‌ని పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. దీంతో రాధేశ్యామ్ చిత్రంతో అల‌రించాల‌ని అనుకుంటున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల చేయాలని మేక‌ర్స్ భావిస్తుండ‌గా, క‌రోనా ప్ర‌తీసారి అడ్డుప‌డుతుంది. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ప్ర‌భాస్ న‌టిస్తున్న స‌లార్, ఆదిపురుష్ చిత్రాలు కూడా సెట్స్‌పైనే ఉన్నాయి. ఆదిపురుష్ సినిమా హాలీవుడ్ సినిమా రేంజ్ లో విజువల్ వండర్ గా ఉంటుందని అంటున్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమాల‌న్నింటిలో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రం నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుందని అంటున్నారు. మ‌హాన‌టి చిత్రంతో అంద‌రి దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌ని దించుతున్నాడు. ఈ సినిమాతో ప్ర‌భాస్ రేంజ్‌ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తీసుకెళ్లాల‌నే క‌సితో నాగ్ అశ్విన్ ఉన్నాడు. కథ నుండి మొదలుకుని టెక్నికల్ అంశాల వరకు అన్నింటిని కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.

సినిమా ఆలస్యం అవుతున్నా కొద్ది అదనపు హంగులను నాగ్ అశ్విన్ అద్దుతున్నాడు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా హాలీవుడ్ కెమెరామెన్‌ని తెప్పిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా, ఆయ‌న ఈ సినిమా షూటింగ్ కోసం అత్యంత అరుదైన ఖరీదైన ఎరీ అలెక్సా 65 లెన్స్ ను వాడబోతున్నాడట. ఇటీవల వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ వంటి భారీ హాలీవుడ్ చిత్రాల‌కు ఇలాంటి లెన్స్ వాడార‌ట‌. ఇప్పుడు త‌న సినిమా కోసం నాగ్ అశ్విన్ వాడాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

సైన్స్ ఫిక్షన్ మూవీకి వినియోగించబోతున్న ఏరీ అలెక్సా 65 లెన్స్ ఖరీదు 1.5 లక్షల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 12 కోట్లుగా చెబుతున్నారు. అంత ఖరీదైన లెన్స్ ను వాడబోతున్న నేపథ్యంలో సినిమా క్వాలిటీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సినిమా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా అంత‌ర్జాతీయ స్థాయిలో ఉండాల‌ని అంత‌ర్జాతీయ వీఎఫ్ఎక్స్ కంపెనీతో చేయించ‌నున్నార‌ట‌. ఇంటర్నేష‌న‌ల్ లెవ‌ల్‌లో రూపొంద‌నున్న ఈ సినిమాతో అంత‌ర్జాతీయంగా రికార్డులు సాధించాలని ప్ర‌భాస్- నాగ్ అశ్విన్ కాంబో భావిస్తుంది.